Monday, July 22, 2019

Big Gossip : డమ్మీ డైరెక్టర్లు కావాలంటోన్న దేవరకొండ?

విజయ్‌ దేవరకొండ ఈరోజు అంత పెద్ద స్టార్‌ అయ్యాడంటే తరుణ్‌ భాస్కర్‌, సందీప్‌ వంగా, పరశురామ్‌ లాంటి దర్శకులే కారణం. తన స్టార్‌డమ్‌ వెనుక దర్శకుల ప్రతిభ ఎంత వుందో తెలిసినా కానీ తాను ఒప్పుకునే సినిమాలకి మాత్రం దర్శకుడికి నిర్ణయాధికారం లేకుండా వుండేలా విజయ్‌ దేవరకొండ కావాలని కొందరిని ఎంచుకుంటున్నాడనే పుకార్లు వినిపిస్తున్నాయి.

అయితే కొత్త దర్శకులు లేదా ఫ్లాప్‌లో వున్న దర్శకులకే విజయ్‌ దేవరకొండ ఛాన్స్‌ ఇస్తున్నాడట. కథ నచ్చితేనే అవకాశం ఇచ్చినా కానీ సినిమా ఎలా రూపొందాలనే దానిపై దర్శకుడికి కంట్రోల్‌ వుండకుండా జాగ్రత్త పడుతున్నాడట.

తన స్టార్‌డమ్‌ వల్ల ఖచ్చితంగా నిర్మాతలు తన మాటే వింటారనేది విజయ్‌ దేవరకొండకి తెలుసు. దీని వల్ల కనీసం పోస్టర్‌ ఓకే చేసే హక్కు కూడా దర్శకుడికి వుండడం లేదట. చివరకు ప్రమోషన్లలో దర్శకుడు ఎక్కడ వుండాలో, ఎంత మాట్లాడాలో కూడా అతనే డిసైడ్‌ చేస్తున్నాడట.

తన సినిమాకి జనం వచ్చేది తనని చూసి కనుక ఎలాంటి ఇమేజ్‌ లేని దర్శకులని ఎంచుకుని అన్నీ తన కంట్రోల్‌లో వుంచుకుంటున్నాడనే టాక్‌ విపరీతంగా ముదిరిపోతున్న దశలో దీనిని ఎలా కౌంటర్‌ చేస్తాడో విజయ్‌ దేవరకొండ.

No comments:

Post a Comment