ఈ మధ్యనే ఒక యంగ్ హీరో ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చాడు. వరుసగా ఫ్లాపులతో
డిప్రెషన్లోకి వెళ్ళిపోయానంటూ చెప్పుకున్న హీరో, ఇప్పటివరకు తాను చేసిన
డజను సినిమాల్లో దేనికీ అసలు పారితోషకమే తీసుకోలేదని సెలవిచ్చాడు. అందుకే
ఇప్పుడు తన సినిమాను తానే ప్రొడ్యూస్ చేసుకుంటున్నట్లు కూడా చెప్పాడు. కాని
ఇందులో ఎంతవరకు నిజముంది?
మనోడితో సినిమా చేసిన ఒక ప్రొడ్యూసర్ మాట్లాడుతూ.. ''ముందుగా మనోడు 20 లక్షలు రెమ్యూనరేషన్ కావాలని అన్నాడు. కాని తరువాత అతను చేసిన ఒక సినిమాకు బాగా క్రేజ్ రావడంతో, 50 లక్షలు అయితేనే చేస్తానని చెప్పాడు. మేం 40 లక్షలకు బేరం తెగ్గొట్టాం. అయితే ముందు పాతిక లక్షలు తీసుకుని, మిగిలింగి ప్రాఫిట్‌లో షేర్ కావాలని అన్నాడు. కాని మా సినిమా ఆడకపోవడంతో అతని షేర్ ఇవ్వలేకపోయాం. అయినా కూడా మేం పాతిక లక్షలు ఇచ్చాంగా? అతనేం మాకు ఫ్రీగా సినిమా చెయ్యలేదే'' అని కామెంట్ చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అలాగే కొన్ని పెద్ద బ్యానర్లు ప్రొడ్యూస్ చేసిన మల్టీస్టారర్లలో కూడా మనోడు నటించాడు. అవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలు కావడంతో, మాట్లాడుకున్న డబ్బంతా అడ్వాన్స్ రూపంలో కొంత, ఫైనల్ సెటిల్మెంట్ క్రింద మిగతా భాగం ఇచ్చేశారు. కాని మనోడు అసలు డబ్బులు తీసుకోకుండా సినిమాలు చేసిన అభినవ దానవీరశూరకర్ణ అన్నట్లు బిల్డప్ ఇవ్వడంతో అస్సలు బాగాలేదు అంటున్నారు ఇండస్ర్టీవాసులు

No comments:
Post a Comment