Tuesday, July 2, 2019

బాబు దూర దృష్టి.. జీఎస్టీ క‌లెక్ష‌న్ల‌లో ఏపీ రికార్డ్

గ‌త ప్ర‌భుత్వాధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు దూర దృష్టి, ఆర్థికంగా ఆయ‌న వేసిన అడుగులు రాష్ట్రాన్ని ముందుకు న‌డిపిస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. తాజాగా.. జీఎస్టీ(గూడ్స్ స‌ర్వీస్ ట్యాక్స్‌) విష‌యంలో ఏపీ అత్యున్న‌త రికార్డును సొంతం చేసుకుంది. దేశంలోనే  ఏ రాష్ట్రం కూడా సాదించ‌ని విధంగా 2018-19 సంవ‌త్స‌రానికి గాను 28% పెంపుద‌ల‌తో రికార్డు సాధించింది. దీంతో దేశంలోనే జీఎస్టీ అత్య‌ధిక వ‌సూలు రాష్ట్రంగా ఏపీ రికార్డుల‌కు ఎక్కింది.

2018-19 (చంద్ర‌బాబు కాలం) ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి రూ.20,746 కోట్ల‌నుజీఎస్టీ రూపంలో ఏపీ రాబ‌ట్టింది. దేశంలోని పెద్ద రాష్ట్రాల‌తో పోలిస్తే.. జీఎస్టీ వ‌సూళ్ల‌లో ఏపీనే ముందుంది. అదేస‌మ‌యంలో 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రం విష‌యానికి వ‌స్తే.. ఆనాటి లెక్క‌ల ప్రకారం ఏపీ జీఎస్టీ వ‌సూళ్లు 27.75%గా ఉంది. కేవ‌లం 10 మాసాల స‌మ‌యానికే రూ.10,829 కోట్ల‌ను రాబ‌ట్టారు. దేశంలో వ‌స్తు  సేవ‌ల ప‌న్ను(జీఎస్టీ)ను ప్ర‌వేశ పెట్టి జూలై 1తో రెండు సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రిం చుకుని కేంద్ర ప్ర‌భుత్వం అన్ని రాష్ట్రాల జీఎస్టీ వ‌సూళ్ల‌కు సంబంధించిన లెక్క‌ల‌ను వెల్ల‌డించింది.

వాస్త‌వానికి జీఎస్టీ ప్రారంభించిన తొలి ఏడాదిలో రెవెన్యూ లోటు ప‌రిహారం కింద కేంద్రం నుంచి రూ. 280 కోట్ల‌ను ఏపీ రాబ‌ట్టింది. అయితే, త‌ర్వాత సంవ‌త్స‌రాల్లో మాత్రం ప‌న్నుల రాబ‌డిని పెంచుకుని రికార్డు స్థాయిలో అభివృద్ధి సాధించింది. ప్ర‌తి నెల రెవెన్యూ ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డంతో ప‌న్నుల వ‌సూళ్లు పెరిగాయి. దీంతో కేంద్రం ముందు రాష్ట్రం చేయిచాప‌కుండానే రోజులు గ‌డిచాయి. 2015-16లో ఏపీ నెల‌స‌రి ఆదాయం రూ.1120.8 కోట్లు. గ‌త ఏడాది వ‌ర‌కు కేంద్రం నుంచి వ‌చ్చిన రెవెన్యూ లోటు రూ.1660.99 కోట్లు.

అదే స‌మ‌య‌లో రాష్ట్రం ప‌న్నుల రూపంలో రూ.1728.84 కోట్ల‌ను రాబ‌ట్టుకుంది. ఇది 27.75%కి చేరింది. పెట్రోలియం కంపెనీలపై విధించే వ్యాట్‌, జీఎస్టీ ఎల్పీజీ, కిరోసిన్ వంటిద్వారా ఆదాయాన్ని పెంచుకుంది. గ‌తంలోని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రెవెన్యూలోటును దృష్టిలోపెట్టుకుని కేంద్రాన్ని పలుమార్లు ఆ లోటును భ‌ర్తీ చేయాల‌ని కోరింది. ఈ క్ర‌మంలోనే కేంద్రం కూడా స‌హ‌క‌రించింది. ఇక‌, త‌ర్వాత జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డంతో ఇప్పుడు రాష్ట్రం రికార్డు సృష్టించింది. మొత్తానికి బాబు దూర‌దృష్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా నిల‌బెట్టింద‌ని అంటున్నారు ఆర్థిక నిపుణులు.

No comments:

Post a Comment