ఏ సినిమా సక్సెస్‌ని అయినా సరిగ్గా అంచనా వేస్తాడంటూ దిల్ రాజుకి పేరుంది.
దిల్ రాజు ఒక సినిమా కొన్నాడనగానే అటు బయ్యర్లలో, ఇటు ఆడియన్స్‌లో కూడా
ఒక పాజిటివ్ వైబ్ సెట్ అవుతుంది. అదీ కాక అతను సినిమా కొంటే థియేటర్ల
సమస్య కూడా వుండకుండా సాఫీగా, భారీగా రిలీజ్ చేసుకోవచ్చుననే నమ్మకముంది.
అందుకే ఇస్మార్ట్ శంకర్‌ని హోల్‌సేల్‌గా కొనేయమని దిల్ రాజుకి ఆఫర్ ఇచ్చాడు పూరి జగన్నాథ్. కానీ మెహబూబా అనుభవంతో ఈసారి పూరిని నమ్మలేదు రాజు. పూరితో పాటు రామ్ మార్కెట్ కూడా సరిగా లేదని ఈ చిత్రం వైపు కూడా చూడలేదతను. కానీ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ బంపర్ హిట్ అయింది. పూరి ఆఫర్ చేసిన రేటుకి కొన్నట్టయితే దిల్ రాజుకి కనీసం రెండింతలు లాభాలు వచ్చేవి.
అదృష్టం అన్నిసార్లు తలుపు తట్టినా కానీ ఈసారి రిస్క్ చేయడానికి ఇష్టపడలేదని దిల్ రాజు తెగ ఫీలవుతున్నాడట. చేతి దాకా వచ్చిన చిత్రాన్ని కాదనుకున్నందుకు దిల్ రాజు ఇప్పుడు బాధ పడుతున్నాడట. గత సినిమాల అనుభవంతో ఒక దర్శకుడిని లేదా హీరోని తక్కువ అంచనా వేస్తే అంతే మరి. అసలే జూదంలాంటి సినీ పరిశ్రమలో పోయిన డబ్బులు వచ్చే వరకు వాళ్ల మీదే పెట్టుబడి పెడితే సరి.

No comments:
Post a Comment