Saturday, July 20, 2019

అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ జ‌గ్గూభాయ్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా  అనిల్ రావిపూడి  ద‌ర్శ‌క‌త్వంలో `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌స్తుతం క‌శ్మీర్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో ఓ ఇంట్ర‌స్టింగ్ పాత్ర‌లో న‌టించనున్న  జ‌గ‌ప‌తి బాబు  సినిమా నుండి త‌ప్పుకుంటున్న‌ట్లు  న్యూస్ వ‌చ్చిన సంగతి కూడా తెలిసిందే.  అయితే ఈ క్యాక‌ర్ట‌ర్ ప్ర‌కాష్ రాజ్ తో న‌టింప‌జేయ‌డానికి మ‌హేష్‌, ద‌ర్శ‌కుడు రిక్వెస్ట్ తోనే జ‌గప‌తి బాబు త‌ప్పుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఈ నేప‌థ్యంలో డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి త‌న ట్టిట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు. దాని సారాంశం ఏమిటంటే...`జ‌గ‌ప‌తి బాబు గారు `స‌రిలేరు నీకెవ్వ‌రు` లో న‌టించ‌డానికి చాలా ఇంట్ర‌స్ట్ క‌న‌బ‌రిచారు. ఈ సినిమాలో తన క్యార‌క్ట‌ర్ ని ఎంతో ఇష్ట‌ప‌డ్డారు కూడా. అయితే కొన్ని రీజ‌న్స్ వ‌ల్ల ఆయ‌న మా సినిమాలో న‌టించ‌డం లేదు. కానీ ఫ్యూచ‌ర్ లో ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని కోరుకుంటున్నా. మ‌మ్మ‌ల్ని అర్థం చేసుకున్నందుకు జ‌గ‌ప‌తిబాబు గారికి  కృత‌జ్ఞ‌తలు`` అంటూ ఓ పోస్ట్ చేసాడు అనిల్ రావిపూడి.    ఇక దీనిపై ఇప్ప‌టికే జ‌గ‌ప‌తి బాబు  స్పందిస్తూ ..`` క్యార‌క్ట‌ర్ న‌చ్చింది, ఈ క్యార‌క్ట‌ర్ కోసం రెడు సినిమాలు కూడా వ‌దులుకున్నా...కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాలో చేయ‌లేపోతున్నా అంటూ ఓ వీడియో విడుద‌ల చేసారు. మ‌రి ఆ కార‌ణం ఏంట‌నేది ఆ చిత్ర యూనిట్ కే తెలియాలి.

No comments:

Post a Comment