Tuesday, February 25, 2020

హిట్ సినిమాను అలా వాడుకున్న రాజమౌళి

హీరో నాని, దర్శకుడు రాజమౌళి మధ్య మంచి రిలేషన్ ఉంది. ఆ అభిమానంతోనే నాని నిర్మాతగా తీసిన హిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు దర్శకుడు రాజమౌళి. అయితే చాలా తెలివిగా, పక్కాగా ఈ కార్యక్రమాన్ని ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కి వేదికగా మలచుకున్నారు. వాస్తవానికి ఇది హిట్ సినిమా ప్రమోషన్ ఈవెంటే అయినా, రాజమౌళి-సుమ ఎపిసోడ్ మాత్రం హైలెట్ గా నిలిచింది.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ 2021 జనవరి 8న పక్కాగా వస్తున్నామంటూ అనౌన్స్ చేశారు జక్కన్న. సినిమా బాగా లేటవడంతో కో-డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ల భార్యలు రాజమౌళిపై కేసులు పెట్టారని, సినిమా ఎప్పుడు పూర్తిచేస్తారని అడుగుతున్నారని.. "హిట్" ఫంక్షన్లో సుమ ప్రశ్నించింది.
దీనికి హీరోల పేర్లు కూడా జతచేస్తూ.. రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు కేసు పెట్టలేదా అని ఎదురు ప్రశ్నించారు రాజమౌళి. వారు కూడా అడుగుతున్నారు, మా హీరోల్ని మీ దగ్గర పెట్టుకున్నారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఆందోళనలో ఉన్నారు, వారికి కూడా సమాధానమివ్వండని అడిగింది సుమ. చెప్పాం కదా 2021లో వస్తున్నామని రాజమౌళి అనడంతో... 2021 సమ్మర్ కా అంటూ టీజ్ చేసింది సుమ. ఫైనల్ గా 2021 జనవరి-8న వస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చారు రాజమౌళి.
ఈ చర్చ మరింతసేపు కొనసాగింది. మొత్తమ్మీద నాని సినిమా ఫంక్షన్ ను ఆర్.ఆర్.ఆర్. కోసం బాగా ఉపయోగించుకున్నాడు రాజమౌళి. నిజానికి ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ కొన్ని రోజుల కిందట అధికారికంగా వచ్చింది. కానీ చాలామంది నమ్మలేదు. ఆల్రెడీ చెప్పిన డేట్ నుంచి సైడ్ అయ్యారని, ఈ తేదీ నుంచి పక్కకు తప్పుకోరని గ్యారెంటీ ఏంటంటూ అనుమానాలు వ్యక్తంచేశారు. అలాంటి వాళ్ల అనుమానాలన్నింటినీ రాత్రి రాజమౌళి నివృత్తి చేశాడు. ఈసారి రిలీజ్ డేట్ పక్కా అని స్పష్టంచేశాడు.

No comments:

Post a Comment