Tuesday, February 9, 2021

ఉప్పెన క్లైమాక్స్ ఇదేనా? ఇందులో నిజమెంత?

 ఉప్పెన క్లైమాక్స్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తున్న టాపిక్. ఈ సినిమా క్లైమాక్స్ పై అంతా తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. విలన్ విజయ్ సేతుపతి, హీరో వైష్ణవ్ తేజ్ చేతులు నరికేస్తాడని కొందరు అంటుంటే.. మరికొందరేమో స్వయంగా హీరోయిన్, హీరోను చంపేస్తుందని చెబుతున్నారు.

ఇంకొందరు మాత్రం సినిమాలో హీరోను విలన్ నపుంసకుడిగా మార్చేస్తాడని చెబుతున్నారు. తన కూతుర్ని ప్రేమించాడనే కోపంతో, హీరో పురుషాంగాన్ని విలన్ నరికేస్తాడని అంటున్నాడు. 

వీటిలో ఎక్కువమంది మాత్రం చివరాఖరి ఆప్షన్ వైపే మొగ్గుచూపుతున్నారు. సినిమాలో విలన్, హీరో పురుషాంగాన్ని కత్తిరిస్తాడని ఎక్కువ మంది చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని నేరుగా చెప్పకపోయినా, చిరంజీవి కూడా పరోక్షంగా ప్రస్తావించారు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

ఇక ఈరోజు ఇంటర్వ్యూల్లో ఈ కథనాలపై హీరో వైష్ణవ్ తేజ్ కూడా స్వయంగా స్పందించాడు. పురుషాంగాన్ని కత్తిరించే అంశంపై సోషల్ మీడియాలో చాలామంది కామెడీ చేస్తున్నారని.. కానీ సినిమా చూస్తే ఆ సీన్ లో లోతు అర్థమౌతుందని పరోక్షంగా వెల్లడించాడు.

"క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో చాలా ప్రచారం నడుస్తోంది. కానీ అందులో పూర్తి నిజం లేదు. సినిమా చూస్తే అందరికీ అర్థమౌతుంది. సోషల్ మీడియాలో క్లైమాక్స్ పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. కొంతమంది దీన్ని ఫన్నీగా చూస్తున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత ఆ సన్నివేశంలో లోతు, అంతరార్థం అందరికీ అర్థమౌతుంది. నిజానికి ఆ సీన్ దగ్గరే ఉప్పెన అనే టైటిల్ జస్టిఫికేషన్ ఉంటుంది."

ఇలా ఉప్పెన సినిమా క్లైమాక్స్ దుఃఖాంతం అనే విషయాన్ని వైష్ణవ్ తేజ్ చెప్పకనే చెప్పేశాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాలో కృతి షెట్టి హీరోయిన్ గా నటించింది.

No comments:

Post a Comment