Friday, February 19, 2021
వైరల్ పిక్: నిజమైన మాహిష్మతిని చూశారా..!!
'మాహిష్మతి సామ్రాజ్యం' పేరు వినగానే మన అందరికీ గుర్తొచ్చేది 'బాహుబలి' సినిమా. దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ 'బాహుబలి'లో వారి సామ్రాజ్యం 'మాహిష్మతి'. దీని కోసమే భల్లాలదేవుడు - అమరేంద్ర బాహుబలి మరియు మహేంద్ర బాహుబలి మధ్య రెండు భాగాలుగా యుద్ధాలు జరిగాయి. భారీ సెట్టింగ్స్ తో గ్రాఫిక్స్ ఉపయోగించి నది ఒడ్డున ఈ విశాలమైన సామ్రాజ్యాన్ని సృష్టించారు రాజమౌళి అండ్ టీమ్. అయితే మహిస్మతి రాజ్యంలోని ఏనుగు కట్టడాన్ని పోలిన నిజమైన పెద్ద రాయి ఉందని తెలుస్తోంది ఐస్ ల్యాండ్ లోని హెఇమే ఐలాండ్ లో ఈ ఎలిఫాంట్ రాక్ ఉంది. ఇది ఏనుగు ఆకారంలో సహజంగా ఏర్పడిన రాయి అని తెలుస్తోంది. ఇది చూసిన వారికి కచ్చితంగా బాహుబలి మహిస్మతి నగరంలోని ఏనుగు ఆకారపు భారీ కట్టడం గుర్తుకు రాకమనదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇకపోతే 'మాహిష్మతి' పేరు మనం ఎప్పుడూ వినకపోవడంతో ఇది సినిమా కోసం రాజమౌళి క్రియేట్ చేసిన ఓ కల్పిత రాజ్యమని భావిస్తుంటటాం. కానీ ఆ రాజ్యం నిజంగానే ఉందనే విషయం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారేమో. నిజానికి భారతదేశంలో ఒక ప్రాచీన నగరం 'మాహిష్మతి'. అవంతి రాజ్య దక్షిణ భాగంలో ఇది అత్యంత ముఖ్యమైనది. ప్రస్తుతం దాని ఖచ్చితమైన స్థానం తెలియనప్పటికీ మధ్యప్రదేశ్ నర్మదా నది ఒడ్డున ఉన్నదని అనేక ప్రాచీన గ్రంథాలలో చెప్పబడింది. అయితే ఈ చరిత్ర అందరికి తెలియకపోయినా 'బాహుబలి' సినిమా కారణంగా 'మాహిష్మతి' సామ్రాజ్యాన్ని అందరూ గుర్తుంచుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment