Tuesday, February 9, 2021

గాబా స్ఫూర్తితో చెన్నై లో గెల‌వాలి!

 స్వ‌దేశంలో టీమిండియా ఎప్పుడూ పులే. ఎవ‌రి కెప్టెన్సీలో అయినా, ఫైన‌ల్ 11లో ఎవ‌రున్నా.. గ‌త కొన్ని ద‌శాబ్దాల్లో విదేశీ జ‌ట్ల చేతిలో టెస్టుల్లో టీమిండియా ఓడిపోయిన సంద‌ర్భాలు వేళ్ల మీద లెక్క‌బెట్ట ద‌గిన స్థాయిలోనే ఉంటాయి. ఇలాంటి జ‌ట్టుకు ఈ రోజు ఒక క‌ఠిన ప‌రీక్ష ఎదుర‌వుతోంది.

చేతిలో తొమ్మిది వికెట్లున్నాయి. చేయాల్సిన ప‌రుగులు 381. లీగ‌ల్ గా 90 ఓవ‌ర్లున్నాయి. వ‌ర్షం అంత‌రాయం ఛాన్సే లేదు. అమ్ములపొదిలో పుజ‌రా, కొహ్లీ, ర‌హ‌నే.. ప్ర‌ధాన అస్త్రాలు. ఆ పై పంత్, గిల్, వాషింగ్ట‌న్ సుంద‌ర్ లు చేయ‌గ‌ల అద్భుతాలుండ‌నే ఉన్నాయి.

ఆస్ట్రేలియాలో, వ‌రల్డ్ క్లాస్ పేస్ బౌలింగ్ ను ఎదుర్కొంటూ గాబా వంటి బౌన్సీ పిచ్ మీదే నిల‌బ‌డిన ఆట‌గాళ్లు జ‌ట్టులో ఉన్నారు. అలాంటిది వాళ్ల‌కు ఆట‌ప‌ట్టు అయిన చెన్నై లాంటి పిచ్ మీద త‌డ‌బ‌డ‌కుండా నిల‌బ‌డ‌టం పెద్ద విష‌యం కాదు. మిగిలింది 90 ఓవ‌ర్లే.  ఓవ‌ర్ కు నాలుగు పై ప‌రుగుల‌కు మించి రావాలి. 

ఏ ఇద్ద‌రు బ్యాట్స్ మెన్ గ‌ట్టిగా నిల‌దొక్కుకున్నా.. టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో మ‌రో భారీ టార్గెట్ ను టీమిండియా చేజ్ చేస్తుంది. మ‌రో అద్భుత రికార్డును సొంతం చేసుకుంటుంది. స్వ‌దేశంలో త‌న స‌త్తా ఏమిటో మ‌రోసారి చాటుకుంటుంది. అయితే తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బౌల‌ర్లు భార‌త బ్యాట్స్ మెన్ ను బాగానే ఇబ్బంది పెట్టారు. కొహ్లీ, ర‌హ‌నేలు స‌త్తా చూపించ‌లేక‌పోయారు.

ఈ మ్యాచ్ లో  ప్ర‌ద‌ర్శ‌న కొహ్లీకి చాలా కీల‌కం కూడా. ఏ మాత్రం తేడా కొట్టినా.. కెప్టెన్ గా తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన‌డానికి రెడీ అయిపోవాల్సి వ‌స్తుంది కూడా. ఆ ప‌రిస్థితి రాకుండా.. గెలిస్తే మాత్రం, భార‌త క్రికెట్ జ‌ట్టు విజ‌యాల‌ను అల‌వాటుగా చేసుకున్న విష‌యం రుజువు అవుతుంది.

No comments:

Post a Comment