Thursday, February 11, 2021

పుష్పలో అల్లు అర్జున్ ఇంట్రో సీన్ ఇదే…హాలీవుడ్ రేంజ్…ఫ్యాన్స్ కి పూనకాలే!



 టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొట్ట మొదటి సారి ఫుల్ లెంత్ రగ్గుడ్ మాస్ లుక్ తో కనిపించబోతున్న మూవీ పుష్ప, అల వైకుంఠ పురంలో ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్, రంగస్థలం ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆగస్టు 13 న ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో…రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫుల్ జోరుగా కొనసాగుతుంది. కాగా సినిమాలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ ఊరమాస్ గా ఉంటుంది అన్న టాక్ ఎప్పటి నుండో ఉండగా ఇప్పుడు లేటెస్ట్ గా సినిమాలో అల్లు అర్జున్ ఇంట్రో గురించిన సీన్ న్యూస్ ఇప్పుడు…

టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఆ న్యూస్ ప్రకారం సినిమా ఇంట్రో టీసర్ ను అడవుల్లో హాలీవుడ్ రేంజ్ టేకింగ్ తో తోడేళ్ళ గుంపుతో అల్లు అర్జున్ ఫైట్ సీన్ ఉంటుందని అంటున్నారు. ఈ ఇంట్రో సీన్ సుమారు 10 నిమిషాల లెంత్ తో కూడుకుని ఉంటుంది అని చెబుతున్నారు.

No comments:

Post a Comment