Thursday, April 7, 2016

బెడ్ మీద కంగనను ఇబ్బంది పెట్టాడు

బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ బాగా సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి. ప్రాక్టికల్ జోక్స్ విషయంలో కూడా సైఫ్ కి మాంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం తను వెడ్స్ మను భామ కంగనా రనౌత్ తో రంగూన్ అనే మూవీ చేస్తున్నాడు సైఫ్ ఆలీ ఖాన్. ఇందులో ఓ ఇంటిమేట్ సీన్ కోసం చిత్రీకరిస్తున్నపుడు.. జరిగిన సంఘటన అందరికీ ఆసక్తి కలిగిస్తోంది.

స్టోరీ ప్రకారం రంగూన్ లో ఓ బెడ్ రూమ్ సీన్ తప్పనిసరిగా ఉండాలట. ఆ సీన్ ని షూటింగ్ కోసం అన్నీ సిద్ధం చేసుకుని.. యాక్షన్ చెప్పి.. కెమేరా జూమ్ చేశాక.. కంగనాని నవ్వించడం మొదలుపెట్టాడట సైఫ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటిమేట్ సీన్ కావడంతో.. సైఫ్ ఇలా ప్రవర్తించడం చూసి ఆశ్చర్యపోయిందట. తర్వాత సీరియస్ గా ఉండమంటూ సైఫ్ కు గట్టిగా చెప్పిందట కూడా.

అప్పటికీ తన చేష్టలతో నవ్వించేందుకు సైఫ్ ప్రయత్నించడం మానకపోవడంతో డైరెక్టర్ కు అరిచి మరీ కంప్లెయింట్ చేసిందట కంగనా. నన్ను సైఫ్ ఆట పట్టిస్తున్నాడంటూ డైరెక్టర్ చెప్పాక కానీ కంగనా కూల్ అవలేదట. మొత్తానికి ఈ సీన్ ని కంప్లీట్ చేశారు కానీ.. సైఫ్ చేష్టలను  మాత్రం అందరూ చెప్పుకుంటున్నారు.

No comments:

Post a Comment