Tuesday, April 12, 2016

ట్రైలర్ టాక్: మన మేథావి గురించేనయ్యా

శ్రీనివాస రామానుజన్.. ఈ పేరు వినని విద్యార్ధి ఉండడు. చిన్నప్పటి నుంచి గణితంలో ప్రావీణ్యుడిగా శ్రీనివాస రామానుజన్ గురించి మన అందరికీ తెలుసు. ఈ భారతీయ మేథావిపై ఓ హాలీవుడ్ మూవీ రూపొందింది. దానిపేరు 'ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ'. అనంతం గురించి తెలిసిన వ్యక్తి అని డబ్బింగ్ చెప్పుకోవచ్చు. 'గతేడాది విడుదలైన ఈ చిత్రం.. అక్కడ మంచి సక్సెస్ ను సాధించింది. 19వ శతాబ్దం చివర్లో పుట్టిన శ్రీనివాస రామానుజన్.. 20 శతాబ్దంలోని ప్రతిభావంతులైన శాస్త్రజ్ఞుల్లో అగ్రస్థానంలో ఉంటాడు. ఈయన ప్రతిపాదించిన ఎన్నో సిద్ధాంతాలు గణిత శాస్త్ర గతిని మార్చాయి. అలాంటి ఓ మహనీయుడి గురించి హాలీవుడ్ వాళ్లు సినిమా తీశారు. కనీసం ఇలాంటి ఆలోచన ఇక్కడ బడా భారీ ఆర్ట్ డాక్యుమెంటరీ.. ఇలా ఏ రకమైన సినిమా తీసేవాళ్లకైనా అనిపించలేదు. ఇప్పుడీ మూవీ మహా గొప్పగా ఉందంటూ మనోళ్లు పొగిడేస్తున్నారు. నిజంగా ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నందుకు భారతీయ సినిమా సిగ్గు పడాల్సిందే. గతంలో కూడా ఇదే సిట్యుయేషన్. మహాత్మా గాంధీపై ఫారినర్లే సినిమాలే తీశారు. గాంధీగా చేసినది కూడా ఫారిన్ వ్యక్తే. ఇప్పుడు 'ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ'లో సంతోషించదగ్గ విషయం.. శ్రీనివాస రామానుజన్ గా నటించిన దేవ్ పటేల్ అమ్మ ఇండియన్. ఇతను బ్రిటిషర్. ఇతను స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా మనకు ఇప్పటికే పరిచితుడే.

No comments:

Post a Comment