Thursday, April 7, 2016

మద్య నిషేధం దెబ్బకు బీహార్లో పిచ్చెక్కుతోందట

మద్యం తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది... అందుకే మద్యం అలవాటు మానిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ మద్యం తాగడం మానేస్తే హాస్పిటల్ పాలవడం మాత్రం విచిత్రమే. తాజాగా మద్య నిషేధం విధించిన బీహార్ రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయట.

నిత్యమూ మద్యం మత్తులో తూగుతుండే వారంతా మందు దొరక్క వింత చేష్టలకు పాల్పడుతున్నారు. బీహార్ లో మద్య నిషేధం అమల్లోకి వచ్చిన తరువాత ఇప్పటివరకూ 749 మంది ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో చాలా మంది తమ కుటుంబ సభ్యులను గుర్తించలేకపోతున్నారు కూడా. మత్తు కోసం సబ్బులను తినేస్తున్నారట కొందరు. ఇవన్నీ ఎవరో చెబుతున్నవి కావు... సాక్షాత్తు బీహార్ వైద్య శాఖ ఉన్నతాధికారులే వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటికే సులు భారీగా వస్తున్నాయని.. ఈ పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించామని బీహార్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆసుపత్రుల్లో చేరిన వారిలో 96 మందికి తాత్కాలికంగా ఇంజక్టబుల్ డ్రగ్సు ఇచ్చి కాస్త పిచ్చి తగ్గేలా చేశారట. అందరినీ మద్యం అలవాటు నుంచి దూరం చేయొచ్చని... కొద్ది రోజుల పాటు ఈ పరిస్థితిని భరిస్తే తరువాత వారంతా మామూలు మనుషులు అవుతారని చెబుతున్నారు.  కొందరు డాక్టర్లు మాత్రం సరదాగా.. వీరికి వెంటనే పిచ్చి తగ్గాలంటే మామూలు మందులు కాకుండా ఆ ‘మందు’ రాసివ్వాలేమో అంటున్నారు.

No comments:

Post a Comment