Tuesday, May 17, 2016

సెన్సార్ టాక్ : బ్రహ్మోత్సవం

పివిపి సంస్థ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న బ్రహ్మోత్సవం సెన్సారు పూర్తయింది. దీంతో కాస్త కాస్తగా సినిమా వైనం బయటకు వస్తోంది. మహేష్ బాబు-శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో తయారైన ఈ సినిమాకు నిడివి ఓ ప్లస్ పాయింట్. రెండు గంటల 15 నుంచి ఇరవై నిమషాల లోపే. సినిమా ప్రథమార్థం బాగుందని, రేసీగా, ఎంటర్ టైనీగా వుందని తెలుస్తోంది. ద్వితీయార్థంలో కాస్త లాగ్ సీన్లు వున్నాయని, కానీ ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్ బాగా కుదరియాని టాక్. ఆ లాగ్ సీన్లు అంటే లాగ్ అని కాదని, శ్రీకాంత్ అడ్డాల తన స్టయిల్ లో కాస్త స్లోగా నెరేట్ చేసే సీన్లు కొన్ని వున్నాయని తెలుస్తోంది. మహేష్ బాబు సెకండాఫ్ లోని చివరి సగంలో స్టీల్ ది షో అని, క్లయిమాక్స్ లో తన నటనతో మెస్మరైజ్ చేస్తాడని తెలుస్తోంది. సినిమా మొత్తం మీద మహేష్ చాలా క్రెడిట్ కొట్టేస్తాడని అంటున్నారు. మొత్తం మీద సినిమా మంచి మార్కులు సంపాదిస్తుందన్నది సెన్సారు టాక్. ఈ సినిమాకు అనుకూలాంశమేమిటంటే, ప్రేక్షకులకు ఈ సినిమా ఏ జోనర్, ఎలా వుంటుందన్నదానిపై ఓ క్లారిటీ వుండడం. శ్రీకాంత్ అడ్డాల సినిమాలు అంటే ఎలా వుంటాయి అన్నది రెగ్యులర్ ప్రేక్షకులకు ఇప్పటికే ఓ అవగాహనం వుంది. సో ఆ అవగాహనతో వచ్చేవారికి ద్వితీయార్థం సీన్లు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. టోటల్ గా సినిమా అయితే చాలా కలర్ ఫుల్ గా, హోమ్లీగా, చూడముచ్చటగా వుందని టాక్.

No comments:

Post a Comment