ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి సినీ దర్శకుడు రాజమౌళి
సూచనల్ని, సలహాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న విషయం విదితమే. ఇంతకీ,
అమరావతి డిజైన్లపై మీ ముద్ర ఏంటి.? అన్న ప్రశ్నకు, 'ఏదో ఉడతా భక్తి
సాయం..' అని రాజమౌళి అనేశాడు. తన సినిమాల్లో అద్భుతమైన సెట్స్‌తో,
అత్యద్భుతమైన గ్రాఫిక్స్‌తో అద్బుతాలు చేసే రాజమౌళి, అమరావతి కోసం
సలహాలివ్వమంటే ఏ రేంజ్‌లో తన ప్రతిభను చాటుకుంటాడోనన్న ఉత్కంఠ అందరిలోనూ
నెలకొంది.
ఇంతకీ, రాజమౌళి అమరావతి డిజైన్లకు దిద్దిన మెరుగులేమిటో తెలుసా.? ఓ
చతురస్రాకార భవనం.. అందులో తెలుగుతల్లి విగ్రహం.. భవనం పై భాగంలో, సూర్య
కాంతిని ఒడిసిపట్టే ఓ కటకం.. దాన్నుంచి వచ్చే రిఫ్లెక్షన్.. తెలుగుతల్లి
విగ్రహంపైకి వెళ్ళడం.. అంతే, తెలుగు తల్లి విగ్రహం అద్భుత కాంతులతో బంగారు
వర్ణంలో మెరిసిపోవడం.. ఇదీ కాన్సెప్ట్.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఏడాదికి రెండు సార్లు.. సూర్య
కిరణాలు నేరుగా, సూర్య దేవాలయంలోని సూర్యనారాయణమూర్తి పాదాల్ని తాకుతాయి. ఆ
అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు తరలి
వెళ్తుంటారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఇంకెక్కడా లేని అద్భుతమిది. ఆ
తరహాలోనే అమరావతి డిజైన్లకు తనదైన స్టయిల్లో రాజమౌళి మెరుగులు దిద్దాడు.
'ఇదీ నా కాన్సెప్ట్..' అంటూ సోషల్ మీడియాలో రాజమౌళి పోస్ట్ చేసిన వీడియో
వైరల్‌గా మారిందిప్పుడు. ఈ తరహా గ్రాఫిక్స్ అద్భుతాల విషయంలో రాజమౌళికి
తిరుగులేదంతే.!
No comments:
Post a Comment