Thursday, December 21, 2017

సాయిపల్లవి.. కెరీర్లో బిగ్గెస్ట్ ఛాన్స్

మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో సౌత్ ఇండియాలో తిరుగులేని గుర్తింపు సంపాదించింది సాయి పల్లవి. దీని తర్వాత ఆమె మలయాళంలోనే నటించిన ‘కాళి’ కూడా హిట్టయింది. ఇక తెలుగులో సాయిపల్లవి తొలి సినిమా ‘ఫిదా’ కూడా బ్లాక్ బస్టరే. ఇప్పుడామె ‘ఎంసీఏ’తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఐతే ఇప్పటిదాకా సాయిపల్లవి మీడియం రేంజి సినిమాల్లో.. అప్ కమింగ్ హీరోలతోనే నటించింది. పెద్ద స్టార్ సరసన నటించలేదు. ఇప్పుడు తొలిసారిగా ఆమెకు అలాంటి అవకాశం వచ్చింది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన సూర్య సరసన సాయిపల్లవి నటించడబోతుండటం విశేషం.

సంక్రాంతికి ‘తానా సేంద కూట్టం’ (తెలుగులో ‘గ్యాంగ్’) సినిమాతో పలకరించబోతున్న సూర్య.. కొత్తగా రెండు సినిమాలు కమిటయ్యాడు. అందులో ఒకటి సెల్వరాఘవన్ డైరెక్ట్ చేయబోయే సినిమా. ఈ చిత్రానికి సాయిపల్లవినే కథానాయికగా ఎంచుకున్నారు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కొన్ని రోజుల కిందట సాయిపల్లవి ఒక ఇంటర్వ్యూలో తాను సూర్యకు పెద్ద ఫ్యాన్ అని.. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే అంతకంటే ఆనందం మరొకటి ఉండదని అంది. ఇప్పుడు ఆ అవకావమే దక్కిందామెకు. సెల్వ రాఘవన్ సినిమాల్లో కథానాయికలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. హీరోయిన్లను చాలా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తాడతను. అతడి హీరోయిన్ క్యారెక్టర్లు చాలా ఇంటెన్స్‌‌గా ఉంటాయి కూడా. మరి సూర్య సరసన, సెల్వ దర్శకత్వంలో సినిమా అంటే సాయిపల్లవికిది గోల్డెన్ ఛాన్సే. దీన్ని ఆమె ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.

No comments:

Post a Comment