Tuesday, May 28, 2019

నాని నిర్మాతగా చిన్న హీరోతో సినిమా

నాని
నాని, వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ ను పెట్టిన విషయం తెలిసిందే. తన బ్యానర్ పై తొలి ప్రయత్నంగా 'అ!' అనే సినిమా తీశాడు. ఈ సినిమాకు ప్రశంసలు ఎక్కువగా, డబ్బులు తక్కువగా వచ్చాయి. ఆ మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చిన ఈ హీరో, నిర్మాతగా ఇప్పుడు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
విశ్వక్ సేన్ హీరోగా తను నిర్మాతగా వాల్ పోస్టర్ బ్యానర్ పై రెండో సినిమాను ప్రకటించాడు నాని. ఫలక్ నుమా దాస్ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షకు ప్రత్యేక అతిథిగా హాజరైన నాని, అదే వేదికపై తన రెండో సినిమాను ప్రకటించాడు.
ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీతో పాటు ఇంద్రగంటి దర్శకత్వంలో 'V' అనే సినిమా కూడా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే తన నిర్మాణంలో సినిమా స్టార్ట్ చేస్తాడు.
అయితే తన సెకెండ్ వెంచర్ కు సంబంధించి పూర్తి వివరాల్ని మాత్రం నాని వెల్లడించలేదు. విశ్వక్ సేన్ ను కేవలం హీరోగానే తీసుకుంటున్నాడా లేక అతడికే దర్శకత్వ బాధ్యతల్ని కూడా అప్పగిస్తాడా అనే విషయాన్ని చెప్పలేదు. ఫలక్ నుమా దాస్ సినిమాతో విశ్వక్ సేన్ దర్శకుడిగా కూడా మారిన విషయం తెలిసిందే.
, వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ ను పెట్టిన విషయం తెలిసిందే. తన బ్యానర్ పై తొలి ప్రయత్నంగా 'అ!' అనే సినిమా తీశాడు. ఈ సినిమాకు ప్రశంసలు ఎక్కువగా, డబ్బులు తక్కువగా వచ్చాయి. ఆ మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చిన ఈ హీరో, నిర్మాతగా ఇప్పుడు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
విశ్వక్ సేన్ హీరోగా తను నిర్మాతగా వాల్ పోస్టర్ బ్యానర్ పై రెండో సినిమాను ప్రకటించాడు నాని. ఫలక్ నుమా దాస్ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షకు ప్రత్యేక అతిథిగా హాజరైన నాని, అదే వేదికపై తన రెండో సినిమాను ప్రకటించాడు.
ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీతో పాటు ఇంద్రగంటి దర్శకత్వంలో 'V' అనే సినిమా కూడా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే తన నిర్మాణంలో సినిమా స్టార్ట్ చేస్తాడు.
అయితే తన సెకెండ్ వెంచర్ కు సంబంధించి పూర్తి వివరాల్ని మాత్రం నాని వెల్లడించలేదు. విశ్వక్ సేన్ ను కేవలం హీరోగానే తీసుకుంటున్నాడా లేక అతడికే దర్శకత్వ బాధ్యతల్ని కూడా అప్పగిస్తాడా అనే విషయాన్ని చెప్పలేదు. ఫలక్ నుమా దాస్ సినిమాతో విశ్వక్ సేన్ దర్శకుడిగా కూడా మారిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment