Monday, July 1, 2019

ఆమె బ్యాగు రేటు.. జస్ట్ 2.6 కోట్లు

పిండి కొద్దీ రొట్టె అంటారు. అలాగే ఆదాయానికి తగ్గట్లే ఖర్చు పెడతారు ఎవరైనా. మరి లక్షల కోట్ల ఆస్తులున్న వాళ్లు వాడే ప్రతి వస్తువు తమ స్థాయికి తగ్గట్లే కదా చూసుకుంటారు. దేశంలోనే అత్యంత ధనికుడైన ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ అదే పని చేస్తోంది. ఆమె వాడుతున్న బ్యాగు రేటు తెలిసి దిమ్మదిరిగిపోతోంది జనాలకు.

లక్షల రూపాయల విలువైన హ్యాండ్ బ్యాగ్‌ల గురించి విన్నాం కానీ.. ఆమె ఏకంగా కోట్ల రూపాయల విలువైన బ్యాగ్ వాడుతుండటం విశేషం. ఆమె బ్యాగు రేటు ఏకంగా రూ.2.6 కోట్లట. ఈ బ్యాగు గురించిన వార్తలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

క్రొకొడైల్ హ్యాండ్ బ్యాగ్‌గా పేర్కొంటున్న దీని విలువ అక్షరాలా రూ.2.6 కోట్లు అట. మరీ అంత ధర ఉండటానికి కారణమేంటి అంటే.. ఈ బ్యాగ్‌లో 240 డైమండ్స్ పొందుపరిచారట. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్.. నీతా అంబానీతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఈ బ్యాగ్ సంగతి బయటికి వచ్చింది. ఆ ఫొటోలో నీతా పట్టుకున్న బ్యాగ్ ధర రూ.2.6 కోట్లన్న సమాచారం బయటికి వచ్చింది.

దీని గురించి అందరూ ఇప్పుడు ఇంటర్నెట్లో శోధిస్తున్నారు.  ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్యాగ్ ఇదే అంటున్నారు. ఐతే లక్షల కోట్ల సంపద ఉన్న వాళ్లు రూ.2.6 కోట్లేంటి పది కోట్లయినా పెట్టి బ్యాగ్ చేయించుకోగలరు కదా!

No comments:

Post a Comment