Thursday, July 4, 2019

బిగ్‌బాస్-3: నాగార్జున షాకింగ్ రెమ్యూనరేషన్... ఎంతో తెలుసా?

బిగ్‌బాస్-3 సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. గతేడాది ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ గురించి, అలాగే హోస్ట్ చేయడం గురించి నాగ్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. అందులో హాస్ట్‌గా చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాడు. అయితే ఈ ఏడాది సీన్ మారింది. నాగార్జున బిగ్‌బాస్-3కి హోస్ట్‌గా చేయడానికి అంగీకరించాడు. అందుకు కారణం లేకపోలేదు. ఈ సీజన్‌కి గానూ హోస్ట్‌గా చేసేందుకు స్టార్ మా నాగార్జునకు భారీ మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఒక్కో ఎపిసోడ్‌కి నాగ్‌కి 12 లక్షలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
బిగ్‌బాస్-3 షో మొత్తం 100 రోజుల పాటు సాగనుంది కాబట్టి నాగార్జునకు మొత్తంగా దాదాపు 12 కోట్లు దక్కనుంది. గతంలో కూడా నాగ్ మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి గానూ ఒక్కో ఎపిసోడ్‌కి ఏడు లక్షల రూపాయలు తీసుకున్నాడని సమాచారం. బిగ్‍బాస్-3 ఈనెల మూడో వారంలో ప్రారంభం కానుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్‌లు పాల్గొననున్న ఈ షో ఈనెల 21వ తేదీన ప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది.

No comments:

Post a Comment