Wednesday, July 17, 2019

ఉరిమి ఉరిమి, గ్యాంగ్ లీడర్ మీద?

బాహుబలి ప్రభాస్ భారీ సినిమా సాహో వాయిదా పక్కా అని తెలుస్తోంది. అంతే కాదు, అధికారికంగా కాకపోయినా, ఈ సినిమా ఆగస్టు 30న విడుదల అని వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే నానీస్ గ్యాంగ్ లీడర్ కు కాస్త కష్టమే. నిన్నటికి నిన్నే ఆ సినిమా ఫస్ట్ లుక్ ఇచ్చి, రిలీజ్ డేట్ ప్రకటించారు. 
సాహో విడుదల వుంటే గ్యాంగ్ లీడర్ విడుదల కచ్చితంగా వాయిదా వేసుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే భారీ సినిమాగా సాహోకు ఆ మాత్రం క్రేజ్ వుంటుంది. అయితే సెప్టెంబర్ మొత్తం ఖాళీనే. సాహో వచ్చిన వారం వెనక్కో, మరి కొంచెం వెనక్కో వెళ్లడానికి గ్యాంగ్ లీడర్ కు పెద్దగా అడ్డం ఏమీ లేదు. 
కానీ ఆగస్టు 30 అన్నది మంచి డేట్. వినాయకచవితి వగైరా సెలవులు వున్నాయి. మరి ఆ డేట్ ను గ్యాంగ్ లీడర్ వదులుకుంటుందా? అసలు సాహో వ్యవహారం ఏమిటి? అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలే అవకాశం వుంది.
విక్రమ్ కుమార్ డైరక్షన్ లో మైత్రీ మూవీస్ నిర్మించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని రచయితగా వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ గా ఈ సినిమా వుంటుందని టాక్ వుంది.

No comments:

Post a Comment