Saturday, July 20, 2019

అర్జున్‌ రెడ్డిని కెలుక్కుని అభాసు పాలు!

అర్జున్‌రెడ్డి రీమేక్‌ కబీర్‌ సింగ్‌ బాలీవుడ్‌కి ఈ ఏడాదిలో అతి పెద్ద హిట్‌ మాత్రమే కాదు... ఈ ఏడాదిలో అత్యంత కాంట్రవర్షియల్‌ సినిమాగా కూడా వార్తల్లో నిలిచింది. సినిమా కంటే ప్రేమని వ్యక్తం చేసుకోవడానికి ఒకర్నొకరు చెంప దెబ్బలు కొట్టుకోవచ్చు, లేదంటే అది ప్రేమే కాదు అన్న డైరెక్టర్‌ సందీప్‌ వంగా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై అందరూ తమకి తోచినట్టుగా స్పందించేసారు. ఆ వివాదాన్ని సౌత్‌ సెలబ్రిటీలు అయిన సమంత, చిన్మయి శ్రీపాద, అనసూయ లాంటి వారు క్యాష్‌ చేసుకున్నారు.

అయితే అప్పుడేమీ మాట్లాడని తాప్సీ తీరిగ్గా సందీప్‌పై ఇప్పుడు సెటైర్‌ వేసింది. అది కూడా ఒక హత్యా ఘటనకి సంబంధించిన వార్త షేర్‌ చేస్తూ సందీప్‌ వ్యాఖ్యలకి లింక్‌ పెట్టింది. దీంతో తాప్సీపై ట్విట్టర్‌ వార్‌ ప్రకటించింది. దేనికి వెటకారం చేయాలో, దేనికి సెన్సిబుల్‌గా మాట్లాడాలో తెలియదా... ఏమి నటివి నువ్వు అంటూ విరుచుకు పడిన ట్విట్టర్‌ సేనకి తాప్సీ మళ్లీ వెటకారంగానే సమాధానమిచ్చింది.

సెన్సాఫ్‌ సర్కాజమ్‌ లేని వారికి ఏమి చెబుతామంటూ తన వెటకారాన్ని సమర్ధించుకుంది. నాగపూర్‌కి చెందిన ఒక యువకుడు తన ప్రేయసిపై అనుమానంతో కొట్టి చంపేస్తే... అది కూడా ప్రేమని వ్యక్తం చేసే ఒక పద్ధతేమో అంటూ సందీప్‌ కామెంట్‌ని ఇందులోకి లాగింది తాప్సీ. కాస్త సెన్స్‌ వున్న ఎవరైనా ఆమెకి గడ్డి పెట్టే సందర్భమే ఇది. అయితే తా పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్టు వ్యవహరించే తాప్సీ తప్పు ఒప్పుకుంటుందనుకోవడం ట్విట్టరాటీ వెర్రితనమవుతుంది.

No comments:

Post a Comment