పూరి జగన్నాధ్ వరుస ఫ్లాపులతో డౌన్‌లో వున్నపుడు అతడిని చాలా మంది తక్కువ
అంచనా వేసారు. ఇక మళ్లీ పూరి నుంచి ఒక నిఖార్సయిన హిట్ సినిమా రాదనే
అనుకున్నారు. కానీ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ పూరీ తానేంటి అనేది
'ఇస్మార్ట్ శంకర్'తో రుజువు చేసుకున్నాడు. ఈ చిత్రం పాతిక కోట్లకి పైగా
షేర్‌ని అయిదు రోజుల్లోనే సాధించి ఇంకా స్ట్రాంగ్‌గా రన్ అవుతోంది.
ఇదిలావుంటే రామ్ నమ్మినట్టుగా పూరీని అప్పట్లో కొందరు హీరోలు నమ్మలేదు. వరుస ఫ్లాపుల్లో వున్న టైమ్‌లో సాయి ధరమ్ తేజ్‌ని పూరి సంప్రదించాడట. ఒక సినిమా చేద్దామంటూ వెంటపడ్డాడట. అయినా కానీ పూరి ఫామ్ చూసి అతనితో సినిమా ఎందుకులే అని వదిలేసుకున్నాడట. పూరి రిక్వెస్ట్‌ని కూడా లెక్క చేయలేదట. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ అంత పెద్ద హిట్ అవడంతో పూరిని తక్కువ అంచనా వేసినందుకు తేజ్ తెగ బాధ పడుతున్నాడట.
అప్పుడు సినిమా చేసినా లేకున్నా పూరీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసినట్టయితే ఇప్పుడు అతనితో పని చేసే అవకాశం వచ్చేదని తేజ్ ఫీలవుతున్నాడట. అయినా వినాయక్, కరుణాకరన్ లాంటి వాళ్లతో లాటరీ వేసి చూసిన తేజ్ ఖచ్చితంగా పూరీతో ఒక సినిమా చేసి వుండొచ్చు. చరణ్, బన్నీ, వరుణ్ అంతా పూరీతో చేసిన వాళ్లేగా. చిత్రలహరి కాస్త ఊరట ఇచ్చినా కానీ మళ్లీ తనని తిరిగి పోటీలో నిలబెట్టే విజయాన్ని మాత్రం తేజ్ ఇంకా అందుకోలేదు. మారుతితో చేస్తోన్న ప్రతిరోజు పండగే చిత్రమే తనని గట్టెక్కిస్తుందని ఆశ పడుతున్నాడు.

No comments:
Post a Comment