Tuesday, July 2, 2019

అల్లు అర్జున్‌, మహేష్‌, మధ్య ఎంత గ్యాప్‌?

వచ్చే సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రావడమయితే పక్కా అయింది. బాలకృష్ణతో పాటు ఇంకెవరు అదృష్టాన్ని పరీక్షించుకుంటారనేది తెలియదు కానీ మహేష్‌ 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ సినిమాలు మాత్రం సంక్రాంతికి రాబోతున్నాయి. సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలకి చోటుంది కానీ రెండిటి మధ్య గ్యాప్‌ మెయింటైన్‌ చేయడం ఉత్తమమని ట్రేడ్‌ అంటోంది. అయితే ముందుగా ఎవరు వస్తారు, తర్వాత ఎవరు వస్తారనేది ఇంకా వారే నిర్ణయించుకోలేదు.

రెండు చిత్రాల మధ్య కనీసం అయిదు రోజుల గ్యాప్‌ వుండడం బెస్ట్‌ అనేది ట్రేడ్‌ వర్గాల అభిప్రాయం. కానీ ముందుగా విడుదలైన చిత్రం కనుక బ్యాడ్‌ టాక్‌ తెచ్చుకుంటే లేట్‌గా రిలీజ్‌ అయ్యే దానికి అడ్వాంటేజ్‌ అవుతుంది. అదీ కాక పండక్కి దగ్గరగా విడుదలైన చిత్రానికి ప్లస్‌ అవుతుందని కూడా గతంలో పలుమార్లు రుజువయింది. మరి ఈ రెండు చిత్రాలలో ముందుగా  వచ్చే రిస్క్‌ ఎవరు చేస్తారనేది ఇంకా తేలలేదు. ఒకవేళ వచ్చినా రెండు చిత్రాల మధ్య ఎంత గ్యాప్‌ వుంటుందనేది కూడా తెలీదు. సంక్రాంతి పండుగ మంగళ, బుధ, గురు వారాలలో రావడం వల్ల ఆ ముందు శుక్రవారం అంటే... జనవరి 11 బెస్ట్‌ రిలీజ్‌ డేట్‌. మరి దీనిని ఈ రెండు చిత్రాల్లో ఏది కైవసం చేసుకుంటోందో తెలియడం కోసం ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు.

No comments:

Post a Comment