హీరోల కొడుకులు వారసత్వంగా హీరోలు అయిపోతుంటారు కానీ హీరోయిన్ల పిల్లలు
హీరోలుగా రంగప్రవేశం చేయడం అరుదు. ప్రేమ పావురాలు (మైనే ప్యార్ కియా)
చిత్రంతో భారతదేశం అంతా పాపులర్ అయిన భాగ్యశ్రీ ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో
విజయవంతం కాలేకపోయింది. కొన్ని సినిమాలలో హీరోయిన్‌గా నటించిన అనంతరం
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన భాగ్యశ్రీ త్వరలో తనయుడిని హీరోగా తెరపై
చూసుకోనుంది.
భాగ్యశ్రీ తనయుడు అభిమన్యు దాసాని హీరోగా
నికమ్మా అనే చిత్రం రూపొందుతోంది. సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ
చిత్రాన్ని సోనీ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. సింగర్‌గా సోషల్
మీడియాలో సంచలనం సృష్టించిన షిర్లే సేటియా ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఈ
చిత్రం ఫస్ట్ లుక్‌కి మిశ్రమ స్పందన వస్తోంది.
కొందరు
భాగ్యశ్రీపై అభిమానంతో ఆమె తనయుడు సక్సెస్ కావాలని కోరుకుంటూ వుంటే
ఇంకొందరు మాత్రం ఇంకెంతమంది వారసులని దించుతారంటూ 'నెపోటిజమ్'కి
వ్యతిరేకంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు వస్తోన్న వారసులంతా ఇలాంటి
ట్రోలింగ్‌ని తట్టుకుని నిలబడాల్సిందేనని విజయ్ దేవరకొండ మాటలు అక్షర
సత్యాలని దీంతో మరోసారి చాటుకుంటున్నారు.
No comments:
Post a Comment