Friday, July 19, 2019

రామ్-పూరి.. కలెక్షన్ల కలకలం

కొన్నేళ్లుగా ప్రతి జులైలోనూ తెలుగులో ఒక సెన్సేషనల్ హిట్ ఉంటోంది. ఇదే విషయాన్ని ఒక పీఆర్వో ప్రస్తావిస్తూ ఈ ఏడాది జులైలో సెన్సేషన్ క్రియేట్ చేయబోయే సినిమా ఏది అంటూ నెల రోజుల కిందట ట్విట్టర్లో ఒక పోల్ పెట్టాడు. దీనికి  ‘ఇస్మార్ట్ శంకర్’ అంటూ బదులిచ్చింది ఆ చిత్ర నిర్మాత ఛార్మి. ఐతే ట్విట్టర్లో ఈ కామెంట్ మీద కామెడీగా స్పందించిన వాళ్లే ఎక్కువమంది.

పోల్‌లో ఎక్కువమంది ‘డియర్ కామ్రేడ్’కే ఓటు వేయడం గమనార్హం. ఐతే ‘డియర్ కామ్రేడ్’ మీద ఉన్న అంచనాలకు ఆ సినిమా పెద్ద హిట్టయినా ఆశ్చర్యం లేదు. కానీ అసలైన సెన్సేషన్ అంటే మాత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చెప్పాలి. బ్యాడ్ టీజర్, ట్రైలర్లతో జనాలకు నెగెటివ్ ఫీలింగ్ తెప్పించినట్లు కనిపించిన ఈ చిత్రం.. ఇప్పుడు బాక్సాఫీస్‌ను షేర్ చేస్తున్న తీరు సెన్సేషనలే.

రిలీజ్ ముంగిట ‘ఇస్మార్ట్ శంకర్’కు జరిగిన బుకింగ్సే షాకింగ్‌గా అనిపించాయి. చాలా షోలు రెండు రోజుల ముందే ఫుల్ అయిపోయాయి. రిలీజ్ రోజు అసలు టికెట్లు దొరకడం కష్టమైంది. శుక్రవారం తెలంగాణలో దాదాపుగా అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈ ఏడాది పెద్ద సినిమాలైన ‘మహర్షి’, ‘వినయ విధేయ రామ’ చిత్రాల్ని మించి కొన్ని సెంటర్లలో ‘ఇస్మార్ట్ శంకర్’కు ఎక్కువ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతుండటం ఆశ్చర్యకరం.

తెలంగాణ వ్యాప్తంగా కలెక్షన్ల ర్యాంపేజ్ కనిపిస్తోంది. ఆంధ్రాలో కూడా మంచి వసూళ్లే వస్తున్నాయి. ఓవరాల్‌గా తొలి రోజు ఈ చిత్రం రూ.8 కోట్లకు చేరువగా షేర్ రాబట్టినట్లు చెబుతున్నారు. టైర్-2 హీరోల చిత్రాల్లో ఇది రికార్డే. వీకెండ్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా వెళ్లే అవకాశాలు కనిపిస్తుండటం విశేషం.

No comments:

Post a Comment