Thursday, February 27, 2020

గ్రామ కోర్టులు.. జగన్ మరో సంచలనం

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్ముడి మాటలను అక్షరాల నిజం చేస్తున్నారు ఏపీ సీఎం జగన్. ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న సీఎం జగన్.. మరో భారీ ముందడుగు వేశారు.
అనాదిగా గ్రామాల్లోని వివాదాలు.. వాటికోసం ప్రజలంతా కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బును వృథా చేసుకుంటున్న దృష్ట్యా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ వ్యాప్తంగా 42 గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేస్తూ జగన్ సర్కారు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రతీ గ్రామ న్యాయాలయాల్లో న్యాయాధికారిగా జూనియర్ సివిల్ జడ్జి లేదా జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ విలేజ్ కోర్టుల్లో సూపిరింటెండెంట్ స్టెనో గ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఆఫీస్ సబార్డినేట్ లు కూడా ఉంటారు.

గుంటూరు జిల్లాలో అత్యధికంగా భూవివాదాలు ఉండడంతో ఆ జిల్లాకు 12 విలేజ్ కోర్టులను అత్యధికంగా సీఎం జగన్ సర్కారు మంజూరు చేసింది.  ఆ తర్వాత వరుసగా ప్రకాశంకు 8 కర్నూలుకు 3 నెల్లూరుకు 3 శ్రీకాకులంకు 3 విశాఖ కడప అనంతపురం పశ్చిమగోదావరి కృష్ణా జిల్లాలకు 2 విలేజ్ కోర్టుల చొప్పున మంజూరు చేసింది. మిగిలిన జిల్లాలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసింది. వీటికి నిర్వహణ జీతాల కోసం ఒక్కో న్యాయాలయానికి 27.60 లక్షలు చెల్లించనుంది. 

No comments:

Post a Comment