Friday, January 29, 2021

భారీగా పెరిగిన ధరలు, భారత్‌లో పసిడి డిమాండ్ 25 ఏళ్ల కనిష్టానికి

 

2020లో భారత్‌లో బంగారం డిమాండ్ 35 శాతం క్షీణించి 25 ఏళ్ళ కనిష్టానికి పడిపోయింది. గత ఏడాది పసిడి డిమాండ్ 446.4 టన్నులకు పరిమితమైంది. 2021లో మళ్లీ పుంజుకోవచ్చుననే అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (wcg) నివేదిక వెల్లడించింది. మార్కెట్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, ప్రభుత్వం కూడా నిలకడగా చర్యలు చేపడుతోందని, ఈ సంస్కరణలు తమ రంగాన్ని బలోపేతం చేస్తాయని wcg చెబుతోంది. అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ 11 శాతం తగ్గింది. ధరలు పెరగడం కూడా డిమాండ్ పైన ప్రభావంచూపింది. 2019లో 690.4 టన్నులుగా ఉన్న డిమాండ్, 2020లో 35 శాతం తగ్గి 446.4 టన్నులకు పడిపోయింది. విలువపరంగా 14 శాతం తగ్గింది. అయితే ఇందుకు ధరలు భారీగా పెరగడం కారణం. అందుకే విలువ పరంగా తక్కువగా ఉంది. జ్యువెల్లరీ డిమాండ్ 42 శాతం క్షీణించి 315.9 టన్నులకు, పెట్టుబడుల డిమాండ్ 11 శాతం తగ్గి 130.4 టన్నులకు పరిమితమైంది. పండుగ సీజన్, పెళ్లిళ్ల కారణంగా అక్టోబర్-డిసెంబర్ కాలంలో డిమాండ్ పెరిగింది. 2019లో ఇదే కాలంతో పోలిస్తే శాతమే తగ్గింది.

No comments:

Post a Comment