Monday, January 4, 2021

లాస్య‌కు సారి చెప్పిన ర‌వి

 

బుల్లితెర‌పై యాంక‌ర్‌గా లాస్య కొంత మందికి మాత్ర‌మే తెలుసు. బిగ్‌బాస్ రియాల్టీ షో కంటెస్టెంట్‌గా ఆమె ఇమేజ్ అమాంతం పెరిగింది. హౌస్‌లో ఆమె న‌వ్వుకు ఎంతో మంది ఫిదా అయ్యారు. బిగ్‌బాస్ ఫేం లాస్య‌గా ఇండ‌స్ట్రీలో ఆమె కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నున్నారు.

ఒక‌ప్పుడు బుల్లితెర‌పై లాస్య‌-ర‌వి జోడి ఎంతో సంద‌డి చేస్తూ ప్రేక్ష‌కులను అల‌రించేది.  'సమ్‌థింగ్‌ స్పెషల్'‌ అనే  ప్రోగ్రాం ద్వారా ఈ జోడి పాపులారిటీని సంపాదించుకుంది. అయితే ఆ త‌ర్వాత లాస్య - ర‌వి జోడి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. 

ఏవో విభేదాలొచ్చాయ‌నే వార్త‌లు అప్ప‌ట్లో గుప్పుమ‌న్నాయి. ఆ త‌ర్వాత లాస్య పెళ్లి చేసుకుని న‌ట‌న‌కు ఫుల్‌స్టాప్ పెట్టారు. ఈ నేప‌థ్యంలో లాస్య ఒక్క‌సారిగా అతిపెద్ద వేదికైన రియాల్టీ షోలో ప్ర‌వేశించ‌డంతో, మ‌ళ్లీ ఆమె త‌న న‌వ్వుల‌తో ప్రేక్ష‌కుల‌ను త‌న వైపు తిప్పుకున్నారు.

ఈ నేప‌థ్యంలో లాస్య -ర‌వి జోడి బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. తెలుగువారి మొద‌టి పండుగ అయిన సంక్రాంతికి బుల్లితెర‌పై ఓ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కార్య‌క్ర‌మంలో అల్ల‌రి చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించి ప్రోమో కూడా విడుద‌లైంది. 

ఇందులో లాస్య‌కు ర‌వి సారీ చెప్ప‌డం విశేషం. అంతేకాదు, సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇద్ద‌రూ తాము క‌లిసిపోయామంటూ ఫ్రెండ్షిప్ బ్యాండ్ క‌ట్టుకున్న ఫొటోల‌ను షేర్ చేశారు.

టామ్ అండ్ జెర్రీ మ‌ళ్లీ వ‌చ్చేశాం అంటూ ర‌వి కామెంట్ పెట్టాడు. అంటే గ‌తంలో ఏవో మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగానే విడిపోయార‌ని ప్రేక్ష‌కులు అర్థం చేసుకోవాల‌న్న మాట‌. ఏది ఏమైతేనేం , కొత్త ఏడాదిలో స‌రికొత్త‌గా మ‌న‌ముందుకొస్తున్న యాంక‌ర్స్ జోడీని అభినందిద్దాం. 

No comments:

Post a Comment