Saturday, June 29, 2019

బిగ్‌బాస్‌.. ఫీవర్‌ మొదలైంది బాస్‌.!

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో తెలుగునాట చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్‌ అయ్యిందంటే దానికి మొదటి కారణం జూనియర్‌ ఎన్టీఆర్‌ అయితే, రెండో కారణం కౌశల్‌ ఆర్మీ. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించిన తొలి సీజన్‌ మొదట్లో చప్పగా సాగినా, ప్రతి వీకెండ్‌కీ యంగ్‌ టైగర్‌ తనదైన ఉత్సాహాన్నిచ్చి.. ఆ షో రేటింగ్స్‌ని అమాంతం పెంచేశాడు. 
రెండో సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించిన నాని, తన వరకూ న్యాయం చేసేందుకు ప్రయత్నించాడుగానీ, హౌస్‌మేట్స్‌ ఎవరూ అతన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. అయితే, కౌశల్‌ ఆర్మీ పుణ్యమా అని బిగ్‌ బాస్‌ సీజన్‌ టూ ఓ పెద్ద సెన్సేషన్‌ అయిపోయింది. 
ఇప్పుడిక మూడో సీజన్‌ షురూ అవుతోంది. స్టార్‌ మా ఛానల్‌, ఈ సీజన్‌ హోస్ట్‌ ఎవరో స్పష్టం చేసేసింది. కింగ్‌ నాగార్జున, మూడో సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు సరే.. కంటెస్టెంట్స్‌ ఎవరు.? అన్నదే ప్రస్తుతం సస్పెన్స్‌. చాలామంది పేర్లు విన్పించాయి, అందులో చాలామంది తాము బిగ్‌బాస్‌ హౌస్‌ మేట్స్‌గా వెళ్ళడంలేదని స్పష్టం చేసేశారు. కంటెస్టెంట్స్‌ ఎవరైనాసరే, ఈసారి సోషల్‌ మీడియాని చాలా గట్టిగా వాడేసుకోవాల్సిందే. ఆల్రెడీ ఆ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యిందట కూడా.
ఓ కంటెస్టెంట్‌ అయితే, భారీ డీల్‌ కుదుర్చుకున్నారంటూ సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే, ఆ కంటెస్టెంట్‌ ఎవరన్నదానిపై కొంత సందిగ్ధత కొనసాగుతోంది. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌.. ఒకే తరహా ఎనర్జీని కొనసాగించడం రెండో సీజన్‌లో కౌశల్‌ మండా విజయానికి ప్రధాన కారణం. దానికి కౌశల్‌ ఆర్మీ మరింత ఊతమిచ్చింది. ఆ పాయింట్‌ని బేస్‌ చేసుకునే, కంటెస్టెంట్లు ముందుగా తమ 'ఆర్మీ'ని ప్లాన్‌ చేసుకోవడంలో వింతేముంది.? 
ఇక, నాగార్జునకి బుల్లితెరపై షోస్‌ హోస్ట్‌ చేయడం కొత్తేమీ కాదు. నవ్వించగలడు, శాసించగలడు, అర్థం చేసుకోగలడు. అంతా బాగానే వుందిగానీ, కంటెస్టెంట్లు ఈసారి పెద్ద పెద్ద ఆర్మీలను సోషల్‌ మీడియాలో సిద్ధం చేసుకుంటున్న దరిమిలా, ఆ ఆర్మీల ద్వారా ఎదురయ్యే వ్యతిరేకతను తట్టుకోగలడా.? ఎందుకు తట్టుకోలేడు.? నాగార్జునకి అండగా అక్కినేని ఆర్మీ ఎలాగూ వుంటుంది కదా.! సో, నో ప్రాబ్లమ్‌ అన్నమాట.

No comments:

Post a Comment