Tuesday, June 18, 2019

ప్రభాస్‌ అంటే వాళ్ళకీ వణుకే!


సాహో చిత్రానికి తెలుగు నిర్మాతలు భయపడుతున్నారంటే సినిమా రేంజ్‌ అది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ చిత్రంతో పోటీ పడడానికి పర భాషా హీరోలు, అందునా సూపర్‌స్టార్లు కూడా వెనకాడుతున్నారంటే అది ఖచ్చితంగా ప్రభాస్‌ స్టార్‌డమ్‌ కారణమని ఘంటాపథంగా చెప్పవచ్చు. సాహో ఆగస్టు 15న విడుదలవుతోందని తెలిసి సూర్య సినిమా ఒకటి వాయిదా వేసారు. తాజాగా అజిత్‌ నటిస్తోన్న 'పింక్‌' రీమేక్‌ 'నేర్కొండ పార్వాయ్‌'ని కూడా ఆ రోజు విడుదల చేయడానికి నిర్మాతలు ఇష్టపడడం లేదు. అజిత్‌ రెగ్యులర్‌గా చేసే మాస్‌ సినిమా కాకుండా కాన్సెప్ట్‌ బేస్డ్‌ థ్రిల్లర్‌ కనుక దీనిని 'సాహో'కి పోటీగా విడుదల చేయడం ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుందని వేరే డేట్‌ కోసం అన్వేషిస్తున్నారు.

తెలుగు సినిమాలు అనువాదమయి తమిళనాట రిలీజ్‌ అవుతున్నాయంటే అక్కడి కామెడీ సినిమాలని కూడా పక్కకి జరపరు. అలాంటిది మన హీరో డబ్బింగ్‌ సినిమా కోసం అక్కడి టాప్‌ హీరోలు భయపడుతూ వుండడం తెలుగు వారికి గర్వకారణం అని చెప్పవచ్చు. అయితే హిందీలో మాత్రం ప్రభాస్‌కి ఆ రెస్పెక్ట్‌ దొరకడం లేదు. సాహో రిలీజ్‌ వున్నా కానీ అక్షయ్‌కుమార్‌ 'మిషన్‌ మంగళ్‌' రిలీజ్‌ని ఒక్క రోజు కూడా అటు ఇటు జరపలేదు. బాహుబలి నటుడికి మళ్లీ బాలీవుడ్‌లో ఎర్ర తివాచీ స్వాగతం లభించదనేది మిషన్‌ మంగళ్‌ నిర్మాతల నమ్మకం. మరి వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ మరోసారి ప్రభాస్‌ బాలీవుడ్‌ ప్రముఖులకి మైండ్‌ బ్లాక్‌ చేస్తాడేమో చూద్దాం.

No comments:

Post a Comment