Friday, June 21, 2019

ఓ ర్యాంక్ కుర్రాడి లైఫ్ జర్నీ

ఫస్ట్ ర్యాంక్ రాజు. కన్నడంలో పెద్ద హిట్ అయిన సినిమాకు తెలుగు రీమేక్. ఈ రోజులు మారాయి వంటి కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన చేతన్ ఈ సినిమాలో కథానాయకుడు. ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమా విడుదల సందర్భంగా చేతన్ మీడియాతో  మాట్లాడాడు. ఫస్ట్ ర్యాంక్ రాజు అన్నది ఓ ర్యాంక్ విద్యార్థి లైఫ్ జర్నీ అని చేతన్ వెల్లడించాడు. తనకు ఈ సినిమాలో రెండు ఫేజ్ లు వుంటాయని, ర్యాంక్ కుర్రాడిగా ఒకటి, ఆ తరువాత కాంటెంపరరీ కాలేజ్ స్టూడెంట్ గా మరొటి అని వివవరించాడు.
చదువు తప్ప మరో విషయం పట్టని కుర్రాడు, మళ్లీ వేరే విధంగా ఎందుకు మారాడు? అలా మారినందు వల్ల వచ్చిన ఫలితం ఏమిటి? అన్నది సినిమాలో కీ పాయింట్ అని అన్నాడు. సీనియర్ నటుడు నరేష్, టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లతో ఈ సినిమా చేయడం వల్ల తనకు చాలా ప్లస్ అయిందని, నటన పరంగా తనను తాను బాగా ఇంప్రూవ్ చేసుకోగలిగానని చేతన్ అన్నాడు.
ఇప్పటికి చేసినవి మూడు సినిమాలే అయినా, సినిమా సినిమాకు, ఇంప్రూవ్ మెంట్ చూపించగలిగే అవకాశం వున్న పాత్రలు లభిస్తున్నాయని, అది తన అదృష్టమని చేతన్ అన్నాడు. సినిమాకు దర్శకుడు మారుతి అందించిన సహాయ సహకారాలు ఇన్నీ అన్నీ కావని, ప్రాజెక్టు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి విడుదల చేసే వరకు అన్ని స్థాయిల్లో ఆయన సహకారం అందించారని అన్నారు.
మరో రెండు సినిమాలు ప్లానింగ్ లో వున్నాయని, ఏది చేయాలన్నది ఈ సినిమా విడుదల తరువాత డిసైడ్ చేసుకుంటానని, తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అండగా వున్న మీడియాకు కృతజ్ఞతలని చేతన్ అన్నాడు.

No comments:

Post a Comment