Tuesday, July 23, 2019

బిగ్‌బాస్‌ 3: ఎవరి జాగ్రత్తలో వాళ్లున్నారు

గత సీజన్‌ వీక్షించిన అనుభవంతో ఈ సీజన్‌లో అడుగు పెట్టిన వారంతా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకుల దృష్టిలో బ్యాడ్‌గా కనిపిస్తే ముందుగా ఔట్‌ అయిపోతారనేది గత సీజన్‌లో తేజస్విని చూసి తెలుసుకున్నారు. ఎంత పాపులారిటీ వున్నా కానీ నెగెటివ్‌ ఇమేజ్‌ వస్తే అంతే సంగతులు అని తెలియడం వల్ల ఈసారి కేర్‌ఫుల్‌గా వ్యవహరిస్తున్నారు.

అయితే ఇది ఇంకా మొదటి రోజే కనుక అప్పుడే సీజన్‌ అంతా ఎలా వుంటారనేది చెప్పడం సబబు కాదు. కానీ ఇప్పటికి అయితే అందరూ సేఫ్‌ ఆడుతున్నారు. వీరిలోని అసలు క్యారెక్టర్‌ని బయటకి తెచ్చే టాస్క్‌లు ఇవ్వడం ఇక బిగ్‌బాస్‌కి సవాలు.

కౌశల్‌ మొదటి రెండు వారాలు బ్యాక్‌గ్రౌండ్‌లోనే వున్నా ఒకేసారి క్రౌడ్‌ ఫేవరెట్‌గా మారిపోయాడు. అది గుర్తుంచుకుని అలా ఎక్కువ ఫోకస్‌ అవకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో వుండిపోతున్నారు హిమజ, మహేష్‌ విట్టాలాంటి వాళ్లు. బాబా భాస్కర్‌ కామెడీ పండించాలని తెగ ట్రై చేస్తోంటే, శ్రీముఖి ఎక్కువ డామినేట్‌ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. హేమ అయితే షరా మామూలుగా తన ఓవరాక్షన్‌ స్టార్ట్‌ చేస్తే, సావిత్రి అలియాస్‌ శివజ్యోతి ప్రతిదానినీ సమీక్షించుకునే పనిలో బిజీగా వుంది. వరుణ్‌ సందేశ్‌, వితికల జంట ఇంకా పెద్దగా హైలైట్‌ అవడం లేదు. ఏ గొడవా లేకపోతే ఒక నాలుగైదు వారాలు నెట్టుకుపోవచ్చు అనే మైండ్‌సెట్‌తో వున్నవాళ్లే ఎక్కువ వున్న ఈ సీజన్‌ని బిగ్‌బాస్‌ ఎలా రక్తి కట్టిస్తాడనేది చూడాల్సిందే.

No comments:

Post a Comment