Monday, July 1, 2019

సమంతకి భలేగా కుదిరేసింది

'ఓ బేబీ' చిత్రంపై మునుపు ఎలాంటి అంచనాలున్నాయనేది తెలియదు కానీ ట్రెయిలర్‌ రిలీజ్‌ అయిన తర్వాత మాత్రం ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఎనభై ఏళ్ల బామ్మ లక్షణాలున్న పాత్రలో సమంత ఈ చిత్రంలో వైవిధ్యభరితంగా కనిపించనుంది. ఇంతవరకు ఎన్నో మంచి పాత్రలు పోషించిన సమంత చాలా పెద్ద హిట్స్‌లోను భాగం పంచుకుంది.

అలాంటిది తన కెరియర్‌లో ఓ బేబీ ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని చెబుతుందంటే ఇది ఎంతటి నమ్మకాన్ని కలిగించిందో అర్థమవుతోంది. ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడడంతో పాటు ఇప్పుడు రిలీజ్‌ టైమింగ్‌ కూడా బాగా సెట్‌ అయింది. మజిలీకి ఎలాగయితే రిలీజ్‌ టైమింగ్‌ ప్లస్‌ అయిందో ఓ బేబీకి కూడా చాలా కాలంగా బాక్సాఫీస్‌ వద్ద సందడి లేని వాతావరణం కలిసి వస్తుంది.

మార్కెట్లో వున్న సినిమాలేవీ మరో చిత్రం రావడానికి స్కోప్‌ ఇవ్వనంత గొప్పగా ఆడడం లేదు. ఇటీవలి కాలంలో మెప్పించిన సినిమాలు 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'బ్రోచేవారెవరురా'కి మాస్‌ అప్పీల్‌ లేదు, పెద్ద స్టార్‌ ఎవరూ లేరు. దీంతో ఓ బేబీ కనుక బాగుందనే టాక్‌ తెచ్చుకుంటే ఖచ్చితంగా వసూళ్లు బాగా రాబట్టుకోగలదు. మార్కెటింగ్‌ విషయంలో సమంత స్వయంగా రంగంలోకి దిగి పుష్‌ చేస్తోంది కనుక ఈ చిత్రం గురించి బాగానే మాట్లాడుకుంటున్నారు.

No comments:

Post a Comment