Monday, July 1, 2019

‘కల్కి’కి దర్శకుడు రివ్యూ రాస్తే తక్కువ రేటింగేనట..

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కల్కి’ సినిమాపై విడుదలకు ముందు మంచి అంచనాలే ఉన్నాయి. కానీ ఆ సినిమా ఆ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. క్రిటిక్స్ అందరూ ఈ చిత్రానికి తక్కువ రేటింగ్సే ఇచ్చారు. మామూలుగా తమ సినిమాలకు రేటింగ్స్ తక్కువ ఇస్తే దర్శకులు ఫీలవుతుంటారు.

ఫ్రస్టేషన్ మీడియా మీద చూపించేస్తుంటారు. హరీష్ శంకర్ సహా చాలామంది ఇలా అదుపు తప్పిన వాళ్లే. ఐతే ‘కల్కి’ దర్శకుడు మాత్రం రివ్యూ రేటింగ్స్‌ను తేలిగ్గా తీసుకున్నాడు. ఒకవేళ తాను ‘కల్కి’ సినిమాకు రివ్యూ రాసినా తక్కువ రేటింగే ఇచ్చేవాడినని అతను వ్యాఖ్యానించడం విశేషం. ఇందుకు అతను కారణం కూడా చెప్పాడు.

‘‘ఈ సినిమాకు నేను రివ్యూ రాసినా.. తక్కువ రేటింగే ఇస్తానేమో. ఎందుకంటే.. ఇది ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే టార్గెట్ చేసుకుని తీసింది. ఐతే మేం ఎవరి కోసమైతే సినిమా తీశామో వాళ్లకు బాగానే రీచ్ అవుతోంది. ప్రేక్షకుల మధ్య సినిమా చూశాను. వాళ్ల స్పందన బాగుంది. ఎవరిని అడిగినా సినిమా బాగుందన్నారు’’ అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.

No comments:

Post a Comment