Tuesday, July 9, 2019

అతనికి రెండు నెలలు రాసిచ్చేసిన పూజ హెగ్డే

పూజ హెగ్డేకి తెలుగు చిత్ర సీమలో నంబర్‌వన్‌ కాగలిగే ఛాన్స్‌ వున్నా, తమిళ చిత్ర సీమ నుంచి కూడా ఆఫర్లు వెల్లువెత్తుతున్నా కానీ హిందీ చిత్ర రంగంలో టాప్‌కి చేరుకోవాలనే ఆరాటం ఎక్కువ. తెలుగులో వరుసగా రెండు సినిమాలు చేసిన టైమ్‌లో 'మొహంజుదారో' అనే చిత్రంలో అవకాశం వచ్చిందని రెండేళ్ల పాటు మరే చిత్రం చేయకుండా దానికే ఫుల్‌ టైమ్‌ ఇచ్చింది. తీరా ఆ సినిమా డిజాస్టర్‌ అయి పూజ హెగ్డేకి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయింది. మళ్లీ తెలుగులో టాప్‌కి చేరుకుంటోన్న దశలో పూజ బాలీవుడ్‌ మోజులో పడిపోయింది. హౌస్‌ఫుల్‌ 4 అనే చిత్రంలో గుంపులో గోవిందా అనే పాత్ర చేసిన ఆమె అదే సంస్థకి మూడు సినిమాలకి సంతకం చేయగా, వాళ్లిప్పుడు ఆమెనుంచి బల్క్‌ డేట్స్‌ అడుగుతున్నారు. ఒక యాక్షన్‌ సినిమా కోసమని పూజ హెగ్డే నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలాకి రెండు నెలలు గుత్తంగా రాసిచ్చేసింది. దీంతో మొదటి షెడ్యూల్‌ అయిన తర్వాత అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ల సినిమాకి రెండు నెలల పాటు ఆమె అందుబాటులో వుండదని తెలిసింది. ఆ చిత్రాన్ని వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు కనుక పూజ పాత్రని కుదించి మరో హీరోయిన్‌ రోల్‌ పెంచారని కూడా వినిపిస్తోంది. అంతే కాకుండా ఆ హిందీ సినిమా వల్ల పూజ మరో రెండు పెద్ద సౌత్‌ ప్రాజెక్టులు కోల్పోయిందనే టాక్‌ కూడా వుంది.

No comments:

Post a Comment