Tuesday, July 16, 2019

ఆమె దెబ్బ‌కు మ‌నోడి హాహాకారాలు

లెజెండ‌రీ డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు ఘ‌న వార‌స‌త్వాన్నందుకుని ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు ప్ర‌కాష్ కోవెల‌మూడి. ముందు న‌టుడిగా అదృష్టం ప‌రీక్షించుకుని విఫ‌ల‌మైన ప్ర‌కాష్‌.. ఆ త‌ర్వాత టెక్నీషియ‌న్‌గా మారాడు. తండ్రి బాట‌లో ద‌ర్శ‌క‌త్వం చేప‌ట్టిన అత‌డికి అక్క‌డా చేదు అనుభ‌వాలే ఎదుర‌య్యాయి.

అత‌ను డైరెక్ట్ చేసిన‌ ‘అనగనగా ఓ ధీరుడు’.. ‘సైజ్ జీరో’ దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. దీంతో కొన్నేళ్ల పాటు ఖాళీగా ఉండిపోయాడు. ఇక కెరీర్ ముగిసిన‌ట్లే అనుకుంటే కంగ‌నా ర‌నౌత్, రాజ్ కుమార్ రావు లాంటి ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టీన‌టుల‌తో *జ‌డ్జిమెంట‌ల్ హై క్యా* అనే హిందీ సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. ప్ర‌కాష్ భార్య క‌నిక‌నే ఈ చిత్రానికి స్క్రిప్టు అందించింది. ఈ సినిమా ట్రైల‌ర్ బాగుండ‌టంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి.

ఈ సినిమా అయినా హిట్ అవుతుంద‌ని.. ప్ర‌కాష్ గాడిన ప‌డ‌తాడ‌ని అనుకుంటే ఆ సినిమాను అనుకోని వివాదం చుట్టుముట్టింది. మీడియా వాళ్ల‌తో అన‌వ‌స‌రంగా గొడ‌వ పెట్టుకున్న కంగ‌నా.. వాళ్లు త‌న‌ను బ‌హిష్క‌రించేలా చేసుకుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ ఏవీ మీడియాలో రావ‌ట్లేదు. దీంతో రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్నా సినిమాకు బ‌జ్ రావ‌ట్లేదు.

ఇదిలా ఉన్నా ప‌ర్వాలేదు కానీ.. రేప్పొద్దున మీడియా వాళ్లు క‌క్ష గ‌ట్టి నెగెటివ్ రివ్యూలు ఇస్తే.. సినిమా గురించి యాంటీ ప్ర‌చారం మొద‌లుపెడితే ప‌రిస్థితేంటో? సినిమా ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంటే మీడియా ఏమీ చేయ‌లేదు కానీ.. కాస్త అటు ఇటుగా ఉంటే మాత్రం అంతే సంగ‌తులు. ఇంత‌కుముందు వ‌ర్మ తీసిన *ర‌ణ్‌* సినిమాను మీడియా ఇలాగే తొక్కేసింది. ఇలా త‌న సినిమాను కూడా మీడియా ముంచేస్తుందేమో అని ప్ర‌కాష్ కంగారు ప‌డుతున్నాడ‌ట‌. ఈ సినిమా పోతే మాత్రం ప్ర‌కాష్ అనేవాడు సినిమాల నుంచి అంత‌ర్ధానం అయిపోవ‌డం గ్యారెంటీ.

No comments:

Post a Comment