Monday, July 22, 2019

రెమ్యూనరేషన్‌ లేకుండా రవితేజ!

ఇండస్ట్రీలో ఇప్పుడు అందరికీ షాకిస్తోన్న న్యూస్‌ ఇది. పారితోషికం ఎంతో మాట్లాడిన తర్వాత కానీ కథ వినే అలవాటు లేని రవితేజ తన మార్కెట్‌ ఎంత డౌన్‌లో వున్నా, ఎన్ని ఫ్లాప్స్‌ పడినా తన రేటు మాత్రం తగ్గించుకోనంటాడు. అవసరమయితే ఖాళీగా అయినా కూర్చుంటాడు కానీ పారితోషికం తగ్గించుకోడని కూడా అతడి గురించి చెప్పుకుంటారు.

అలాంటి రవితేజ ఓ చిత్రానికి పారితోషికం లేకుండా చేస్తున్నాడంటే అందరూ షాకవుతున్నారు. ఇంతకీ రవితేజ తన పట్టు ఎందుకు విడిచి పెట్టాల్సి వచ్చింది? ఆర్‌ఎక్స్‌ 100 దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందే మహాసముద్రం చిత్రంలో రవితేజ రెమ్యూనరేషన్‌ లేకుండా లాభాల్లో వాటా మాత్రం తీసుకోవడానికి అంగీకరించాడు.

ఈ కథ తనకి బాగా నచ్చినా కానీ తాను అడిగిన పారితోషికానికి నిర్మాత అంగీకరించలేదట. అవసరమయితే వేరే హీరోతో చేసుకుందామే తప్ప రవితేజ అడిగిన పారితోషికం ఇచ్చి బిజినెస్‌ రిస్క్‌ చేయలేనన్నాడట. ఆ నిర్మాత ఆఫర్‌ చేసిన మొత్తం చాలా తక్కువ కావడంతో, ఈ కథ వదులుకోవడం ఇష్టం లేని రవితేజ లాభాల్లో వాటాకి ఓకే అన్నాడట.

తన సినిమాలకి హిందీ డబ్బింగ్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ బాగా వస్తాయి కనుక నిర్మాత ఆఫర్‌ చేసిన దానికంటే వాటా తీసుకుంటేనే ఎక్కువ వస్తుందని రవితేజ ఇలా ఫిక్స్‌ అయ్యాడట. ఇదిలావుంటే ఈ చిత్రంలో 'బొమ్మరిల్లు' సిద్ధార్థ్‌ ఒక కీలక పాత్ర పోషించడానికి అంగీకరించాడట

No comments:

Post a Comment