Monday, July 22, 2019

మిడిల్‌ రేంజ్‌ హీరోల 'మధ్య' ముదురుతోన్న వార్‌

టాప్‌ హీరోల మధ్య, వారి అభిమానుల మధ్య ఎప్పుడూ టగ్‌ ఆఫ్‌ వార్‌ జరుగుతూనే వుంటుంది. రికార్డులు మావంటే మావి అంటూ హీరోల అభిమానులు ఒకర్నొకరు ట్రోల్‌ చేసుకుంటూ వుంటారు. సూపర్‌స్టార్ల మధ్య ఎంత ఘాటైన యుద్ధం జరుగుతూ వుంటుందో, మిడిల్‌ రేంజ్‌ హీరోల మధ్య కూడా అలాంటి సమరమే జరుగుతోందిపుడు.

నాని, విజయ్‌ దేవరకొండ, వరుణ్‌ తేజ్‌ లాంటి హీరోలు భారీ విజయాలు అందుకుని మిడిల్‌ రేంజ్‌లో అగ్ర భాగానికి చేరుకున్నారు. తాజాగా మజిలీతో నాగచైతన్య, ఇస్మార్ట్‌ శంకర్‌తో రామ్‌ కూడా తిరిగి పుంజుకున్నారు. నితిన్‌, సాయి ధరమ్‌ తేజ్‌ లాంటి వాళ్లు స్ట్రగుల్‌ అవుతున్నా కానీ ప్రస్తుతం మిడ్‌ రేంజ్‌లో ఆధిపత్య పోరు అయితే విపరీతంగా జరుగుతోంది.

ఈ హీరోలందరూ ఒకరి పాత్రని మరొకరు చేయగల ఆల్‌రౌండర్లే కావడంతో ఏదైనా కథ ఒకరి దగ్గర రిజెక్ట్‌ అయినా లేదా ఏదైనా ప్రాజెక్ట్‌ ఎక్కడయినా డిలే అయినా వెంటనే మరో హీరో దగ్గర దర్శకులు వాలిపోతున్నారు. దీంతో ఈ హీరోలందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎప్పుడూ అలర్ట్‌గా వుండాల్సి వస్తోంది. లేదంటే తాము చేయాల్సిన బ్లాక్‌బస్టర్‌ని మరో హీరో ఎగరేసుకుని పోవడమే కాకుండా తమకే ఏకు మేకైపోతున్నాడు మరి.

No comments:

Post a Comment