Thursday, July 4, 2019

సమంత ఆలౌట్ వాడకం అంటే ఇదే

తను చేసిన మిగతా సినిమాలకు చక్కగా ఏసి గదుల్లో కూర్చుని హాయిగా నవ్వుతూ ఇంటర్యూలు ఇచ్చేసేది సమంత. కాని తను స్టార్ హీరోయిన్‌గా అన్నీ తానే నడిపిస్తూ ఇప్పుడు సోలోగా ప్రూవ్ చేసుకోవాలని చూస్తోంది. అందుకే రేపు రిలీజవ్వబోయే 'ఓహ్ బేబి' సినిమా కోసం ఆలౌట్ దండయాత్ర చేసేస్తోంది.

నిజానికి సమంత ఈ సినిమా పోస్టర్లు రాగానే 'మీరు కూడా వింటేజ్ బట్టల్లో దిగిన ఫోటోలు ఉంటే షేర్ చేయండి' అని చెబుతూ సోషల్ మీడియాలో రచ్చలేపింది. ఆ తరువాత సినిమా ట్రైలర్లు టీజర్లు బాగానే హడావుడి చేయగా, అమ్మడు వాటిని సోషల్ మీడియాలో తెగ పాపులరైజ్ చేసింది. ఇక ప్రతీ ఛానల్‌కు ఇంటర్యూలు ఇస్తూనే, మధ్యలో షాప్ ఓపెనింగ్ కార్యక్రమాలకు కూడా వెళ్ళి, తన ఓహ్ బేబి సినిమా చూడమంటూ ప్రమోట్ చేసింది. ఆ తరువాత కాలేజీలకు కూడా వెళ్లి సినిమా గురించి చెప్పొచ్చింది. ఇక టిక్ టాక్ యాప్‌లో ఓహ్ బేబి సినిమా డైలాగులను డబ్ చేసినోళ్ళ వీడియోలు సేకరించి, వాటిని కూడా తన సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేసింది. ఒక్కసారి బేబి వాడకం స్టార్ట్ చేస్తే.. మామూలుగా ఉండదు మరి.. అన్నట్లుంది యవ్వారం.

ఇవన్నీ కలిసొచ్చి సమంతకు తొలి సింగిల్ హిట్ లభిస్తుందా అనేదే మనం చూడాల్సిన విషయం. ఎందుకంటే తెలుగులో అలా సోలోగా సినిమాలను నడిపించే స్టార్ హీరోయిన్లు ప్రస్తుతం కరువయ్యారు. ఎప్పుడో ఓ అరుంధతి, అంజలి అండ్ భాగమతి ఆడాయి కాని, అవి చేసిన హీరోయిన్లకు మిగతా సోలో సినిమాలన్నీ ఫ్లాపుల్నే ఇచ్చాయి. మరి సమంత చరిత్రను తిరగరాస్తుందేమో చూడాలి.

No comments:

Post a Comment