Monday, July 15, 2019

ప్రభాసే చూసుకుంటున్నాడు

సాహో సరిగ్గా నెల రోజుల్లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇంకా బ్యాలెన్స్‌ వుంది. మిగతా పనులన్నీ వేగంగా పూర్తి చేసుకోగలిగినా కానీ ఇంకా విజువల్‌ ఎఫెక్ట్స్‌ పని బాకీ వుండడంతో స్వయంగా ప్రభాస్‌ రంగంలోకి దిగాడు.

విజువల్‌ ఎఫెక్ట్స్‌ గొప్పగా అనిపించకపోతే ఈ చిత్రం చప్పగా వుందని తేల్చేసే ప్రమాదం వుందని ప్రభాస్‌కి తెలుసు. అందుకే పెట్టిన అన్ని కోట్ల ఖర్చు వృధా పోకుండా, విఎఫ్‌ఎక్స్‌ టీమ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేసేలా ప్రభాసే ఈ పనులు పర్యవేక్షిస్తున్నాడు. ఇది తన హోమ్‌ బ్యానర్‌ నుంచి వస్తోన్న సినిమా అనేది మాత్రమే కాకుండా, ఈ చిత్రంతో తాను పాన్‌ ఇండియా స్టార్‌గా సెటిల్‌ అయినట్టా లేదా అనేది కూడా తేలిపోతుంది కనుక ప్రభాస్‌ ఇంత కేర్‌ తీసుకుంటున్నాడు.

ఈ చిత్రం వాయిదా పడుతుందనే వదంతులు వినిపిస్తున్నాయి కానీ ఆరు నూరైనా ఆగస్టు 15 డేట్‌ మిస్‌ అవకూడదని ఫిక్స్‌ అయ్యారు. ఆ వీకెండ్‌లో వస్తేనే ఈ చిత్రానికి మాగ్జిమం క్యాష్‌ చేసుకునే వీలుంటుంది కనుక డేట్‌ పరంగా రాజీ పడడం లేదు. ఇదిలావుంటే ట్రెయిలర్‌ ఆల్రెడీ కట్‌ చేసినా కానీ ఇంకా తుది మెరుగులు దిద్దుతున్నారట. ఈ ట్రెయిలర్‌ చూసిన తర్వాత సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూసేట్టు చేయాలనే లక్ష్యంతో దీనిపై చాలా సమయం వెచ్చిస్తున్నారట.

No comments:

Post a Comment