Monday, February 3, 2020

'అల వైకుంఠపురములో' విమర్శలపై త్రివిక్రమ్..

'అల వైకుంఠపురములో' సినిమా బ్లాక్ బస్టర్ అయి ఉండొచ్చు. అలా అని దీనిపై విమర్శలేమీ లేవని కాదు. సినిమా చూసిన ప్రేక్షకులు కొన్ని విషయాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఐతే వాటికి తాజాగా ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ సమాధానం చెప్పాడు.

'అల వైకుంఠపురములో' సినిమా 'అత్తారింటికి దారేది' లాగే ఉందని.. దీనికి 'నాన్నారింటికి దారేది' అని పేరు పెట్టొచ్చని కౌంటర్లు పడటం గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ''నేనే రాసిన 'చిరునవ్వుతో' సినిమాలో ఒక డైలాగుంది. అదే చెబుతా. ''ప్రపంచంలో కొంతమందికి ఆంజనేయస్వామి అంటే ఇష్టం. కొంతమందికి షిరిడీ సాయిబాబా అంటే ఇష్టం. కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. దేవుడే మనుషులందరినీ ఒప్పించలేకపోయాడు. మనమెంత?''. ఇంతకంటే ఆ విమర్శ గురించి చెప్పడానికేమీ లేదు'' అని చెప్పాడు.

ఇక 'అల...' కాపీ అని.. 'ఇంటిగుట్టు', 'మంచి మనిషి' సినిమాల ఛాయలున్నాయని వస్తున్న విమర్శల గురించి త్రివిక్రమ్ దగ్గర ప్రస్తావిస్తే.. ''పదేళ్ళుగా ఇదొక ఫ్యాషన్‌ అయింది. సక్సెస్‌ అయిన ప్రతి సినిమాకూ ఫలానా కాపీ అనో, ఆ కథ నాదే అనో, మరొకటో రచ్చ చేస్తున్నారు. 'మగధీర' దగ్గర నుంచి ఇప్పటి దాకా చాలా సినిమాలకు  ఇలాంటి విమర్శలొచ్చాయి. రికార్డు విజయం సాధించిన ఏ చిత్రానికి ఇలాంటి విమర్శలు రాలేదు చెప్పండి'' అని త్రివిక్రమ్ ప్రశ్నించాడు.

ఇక 'నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు...' అన్నారు కానీ, 'చూపించినవి కాళ్ళు కాదు తొడలు' అనే విమర్శ గురించి ఏమంటారని త్రివిక్రమ్‌ను ప్రశ్నిస్తే.. ''నిజంగా మా మనసులో ఆ ఇంటెన్షన్‌ లేదు. అలాంటి దురాలోచన, హిడెన్‌ అజెండాతో మేము చేసి ఉంటే, అది అర్థం కానంత అమాయకులు కాదు జనం'' అని తేల్చేశాడు త్రివిక్రమ్.

No comments:

Post a Comment