Tuesday, February 4, 2020

ఆచార్యగా చిరు, సిద్ధుగా చరణ్‌!

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రానికి ఇంకా టైటిల్‌ అధికారికంగా ప్రకటించలేదు కానీ చాలా కాలంగా 'ఆచార్య' అనే పేరయితే ప్రచారంలో వుంది. ఇందులో చిరంజీవి 'గోవిందాచార్య'గా కనిపిస్తారు.

ఇదిలావుంటే ఇందులో రామ్‌ చరణ్‌ ఒక స్పెషల్‌ రోల్‌ చేస్తున్నాడనేది తెలిసిందే. చిరంజీవి లేని పార్ట్‌లో చరణ్‌ కనిపిస్తాడని అప్పట్లో ప్రచారం జరిగింది కానీ ఇద్దరికీ కాంబినేషన్‌ సీన్స్‌ వుంటాయట. చరణ్‌ గెటప్‌ కూడా 'ఆర్‌ ఆర్‌ ఆర్‌'లో మీసకట్టు గెటప్‌కి దగ్గరగానే వుంటుందట. రెండు పాత్రల మధ్య రిలేషన్‌ ఏమిటనేది తెలియదు కానీ చరణ్‌ అయితే ఇందులో 'సిద్ధు' పాత్రలో కనిపించబోతున్నాడు.

అయితే దీనిని మల్టీస్టారర్‌ అనడానికి లేదు. చరణ్‌ పాత్ర ఒక పావుగంట, ఇరవై నిమిషాల పాటు కనిపిస్తుందంతే. చరణ్‌ 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' షూటింగ్‌ పూర్తి చేసిన తర్వాత ఇందులో చేసే స్పెషల్‌ క్యారెక్టర్‌ తాలూకు షూటింగ్‌లో పాల్గొంటాడు. దీనిని ఆగస్ట్‌ 12 లేదా 14న విడుదల చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' వాయిదా పడడంతో సంక్రాంతి సినిమాల తర్వాత వచ్చే భారీ చిత్రం 'ఆచార్య' కానుంది.

No comments:

Post a Comment