Tuesday, February 4, 2020

షాకింగ్: హెల్మెట్ పెట్టుకున్నా ఫైన్ వేస్తున్నారట!

హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తోన్న రాము, సోములు బైక్ మీద హడావిడిగా హైటెక్ సిటీకి బయలుదేరారు. సడెన్ గా ఉరుములు లేని వర్షంలా వచ్చిన ట్రాఫిక్ పోలీసులు రాము బైక్ ను ఆపారు. హెల్మెట్, లైసెన్స్ తో పాటు బండికి సంబంధించిన అన్ని పేపర్లూ ఉన్నాయన్న ధీమాతో ఉన్న రాము....మగధీరలో రామ్ చరణ్ లాగా.....లెక్క తగ్గకుండా అన్ని పేపర్లూ చెక్ చేసుకోండి అన్నట్లు నిలుచున్నాడు.

అన్ని పేపర్లూ సరిగ్గా ఉన్నా....మళ్లీ చలానా రాస్తాను రామూ....అంటూ ట్రాఫిక్ పోలీసు షేర్ ఖాన్ ను మరిపించాడు. కేవలం సోము హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంతో ఫైన్ వేశారని తెలుసుకున్న రామూ అవాక్కయ్యాడు. కామెడీగా చెప్పినా....ప్రస్తుతం హైదరాబాద్,సైబరాబాద్ లో కొన్ని చోట్ల జరుగుతున్న తంతు ఇదే.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోయినప్పటికీ....కొందరు బైకర్లకు తెలంగాణ పోలీసులు షాకిస్తున్నారట. బైక్ నడుపుతున్న వారికే కాదు...వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకొని తీరాల్సిందేనట. లేదంటే ఎనీ ఫైన్ డే వంద రూపాయలు ఫైన్ వేసి రశీదు చేతుల్లో పెడుతున్నారట. ఈ తరహా కేసుల్లో ఫైన్ వేయాలని తెలంగాణ రవాణాశాఖ ప్లాన్ వేస్తోందని ప్రచారం జరిగిన మాట వాస్తవమే.

అయితే, అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో నగరవాసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోలేదు. కానీ, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు మాత్రం చెప్పా పెట్టకుండా ఫైన్ గా ఫైన్ వేస్తుండడంతో బైకర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారట. అయితే, ప్రమాదాల నివారణ కోసమే ఈ చర్యలు అని పోలీసులు చెప్పడం కొసమెరుపు.

No comments:

Post a Comment