Thursday, February 27, 2020

ప్రభాస్ స్ట్రాటజీ.. అదిరిపోలా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులతో పాటు అందరు సినీ ప్రేక్షకులకూ పెద్ద షాకే ఇచ్చాడు. ‘బాహుబలి’తో ఆకాశమంత మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. పక్కా క్లాస్ డైరెక్టర్‌గా గుర్తింపున్న నాగ్ అశ్విన్‌తో సినిమాను ఓకే చేసి ఆశ్చర్యపరిచాడు. ఈ హీరో, ఆ దర్శకుడికి ఉన్న ఇమేజ్‌ల ప్రకారం చూస్తే వీరి కలయికను ఎవరూ ఊహించి ఉండరు.

‘మహానటి’తో ఒకేసారి మేటి దర్శకుడిగా గుర్తింపు పొందినప్పటికీ.. అతడితో ప్రభాస్ లాంటి మాస్ హీరో అతడితో సినిమా చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. అశ్విన్.. ఇప్పటిదాకా తీసిన రెండు సినిమాల్లో కథల్ని ఎంత బలంగా చెప్పినా ప్రభాస్ లాంటి మాస్ హీరోను అతనెలా డీల్ చేస్తాడో అన్న సందేహాలు కలగడం ఖాయం. ‘బాహుబలి’తో ప్రభాస్ ఇమేజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది. సుజీత్ అతడితో ‘సాహో’ రూపంలో మాస్ యాక్షన్ మూవీనే చేసినా.. ప్రభాస్ ఇమేజ్‌ను మ్యాచ్ చేయలేకపోయాడు.

అలాంటిది ఇప్పుడు నాగ్ అశ్విన్ లాంటి క్లాస్ డైరెక్టర్.. ప్రభాస్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడన్నది ఆసక్తికరం. అతడి స్టయిల్లో బలమైన కథ చెబుతూనే.. ప్రభాస్‌ ఇమేజ్‌ను, అతడి అభిమానుల్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే. ఐతే తన ఇమేజ్ గురించి, అభిమానుల అంచనాల గురించే ఆలోచిస్తే.. ప్రభాస్ ఇమేజ్ ఛట్రంలో కూరుకుపోవడం ఖాయం. ఆ రకమైన అప్రోచ్‌నే కొనసాగిస్తే ప్రతి సినిమాకూ తనపై ఒత్తిడి పెరిగిపోతుంది. అందుకే కొంచెం రూటు మార్చి అంచనాల్ని, ఇమేజ్‌ను న్యూట్రలైజ్ చేయడం కోసం అతను రూట్ మారుస్తున్నట్లు అర్థమవుతోంది.

నాగ్ అశ్విన్ సినిమా అంటే.. కచ్చితంగా ప్రభాస్ నట సామర్థ్యానికి పరీక్ష పెట్టే పాత్ర ఉంటుంది. ఆ పాత్రను, ఎమోషన్లను పండించి నటుడిగా తనేంటో రుజువు చేసుకోవడం.. ఒక బలమైన కథతో జనాల్ని మెప్పించడం ప్రభాస్ ముందున్న సవాళ్లు. ఈ విషయాల్లో విజయవంతమైతే ప్రభాస్‌ కెరీర్‌కు చాలా మేలు జరుగుతుంది. యాక్షన్‌ హంగులతో కాకుండా ఒక బలమైన కథతో సక్సెస్ సాధిస్తే ప్రభాస్‌కు ఒక గౌరవం కూడా దక్కుతుంది. అందుకే వ్యూహాత్మకంగా అతను అశ్విన్ సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది

No comments:

Post a Comment