Wednesday, March 4, 2015

బాలీవుడ్‌ మేడమ్‌ ఫింగరింగ్‌ ఎక్కువైందట!

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శతృఘన్‌ సిన్హా కూతురు సోనాక్షి సిన్హాకి కొత్త కొత్త ఆలోచనలొస్తున్నాయి. ఖాళీ ఎక్కువైతే ఆలోచనలు రాకుండా ఉంటాయా? ఫెయిల్యూర్‌ వెనకాలే ఫెయిల్యూర్‌ వస్తుంటే ఖాళీ ఎక్కువైపోయి, సినిమాకి కథలు రాయాలి, స్క్రీన్‌ప్లే సమకూర్చాలి, డైరెక్షన్‌ చేయాలి లాంటి ఆలోచనలు వస్తున్నాయట సోనాక్షి సిన్హాకి. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన తనకు బ్లడ్‌లోనే 'సినిమా గ్రూప్‌' ఉంది కాబట్టి, కథలు రాసుకోవడం తప్పు కాదని సోనాక్షి అంటుంది. సోనాక్షికి ఎవరైనా కథ చెప్పడానికి వెళ్తే, 'అది అలా బాగుంటుంది, ఇది ఇలా బాగుంటుంది' అని సొద చెబుతూ, వారిని విసిగించేస్తుందట. కథలు మేం చెప్తాం, మీరు నటిస్తే చాలు అని మొహమాటం దాటేసి డైరెక్టర్స్‌ కొంతమంది సోనాక్షికి క్లాస్‌ తీసుకున్న సందర్భాలూ ఎక్కువయ్యాయంటున్నారు. ఇంకా కెరీర్‌ ఇప్పుడే సరైన స్టేజ్‌లో ఉందని గ్రహించి, సోనాక్షి కథలు చెప్పడం మానుకుంటే మంచిదని క్లోస్‌ ఫ్రెండ్స్‌ కూడా ఆమెకి సలహాలిస్తున్నారట. తన టాలెంట్‌ని కిల్‌ చేసే సలహాలివ్వొద్దని సోనాక్షి వారినీ కసురుకుంటుందట. ఎవరికి 'పిచ్చి' వారికి ఆనందం అంటే ఇదే. -

No comments:

Post a Comment