Tuesday, January 5, 2016

ఈగోకి పోయి దెబ్బయిపోయాడు

'బాజీరావు మస్తానీ' చిత్రంలో బాజీరావు పాత్రని షారుక్‌ఖాన్‌కే ఆఫర్‌ చేసాడట సంజయ్‌ లీలా భన్సాలీ. కానీ ఆ పీరియడ్‌ సినిమా కోసమని గుండుతో తిరగడం కంటే ఎంచక్కా కమర్షియల్‌గా సేఫ్‌ అయ్యే సినిమా బెటర్‌ అని 'దిల్‌వాలే' చేసాడట. రోహిత్‌ షెట్టి ట్రాక్‌ రికార్డ్‌ బాగుంది కాబట్టి సంజయ్‌ లీలా భన్సాలీతో రిస్క్‌ కంటే ఇదే బెటర్‌ అనుకున్నాడు. అంత వరకు బాగానే వుంది. కానీ 'బాజీరావు మస్తానీ'తో పోటీ పడడానికి షారుక్‌ ఈగోనే కారణమట. ఆ సినిమాతో పోటీ వద్దని క్రిస్మస్‌ రోజున విడుదల చేసుకుందామని రోహిత్‌ శెట్టి కూడా నచ్చచెప్పాలని చూసాడట. కానీ బాద్షా మాటకి ఎదురు లేకపోవడంతో పోటీ తప్పలేదు. తన సినిమాతో పోటీకి వస్తే ఏం జరుగుతుందో చూపించాలని షారుక్‌ ఖాన్‌ ఈగో సమస్యగా తీసుకోవడం వల్లే బాజీరావు మస్తానీపై దిల్‌వాలేని విడుదల చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే షారుక్‌ అనుకున్నది ఒక్కటైతే మరొకటి జరిగింది. రెండు సినిమాల్లో బాజీరావు బాగుందంటూ రిపోర్టులు రావడం ఆ సినిమాకి ప్లస్‌ అయింది. దాంతో పోటీగా వచ్చినందుకు దిల్‌ వాలేకి తక్కువలో తక్కువ యాభై కోట్ల వరకు తక్కువ కలెక్షన్లు వచ్చాయి. బాజీరావుగా నటించి తన కెరియర్లో మరో మరచిపోలేని పాత్రని జమ చేసుకుని వుండాల్సిన షారుక్‌ ఖాన్‌, ఆ అవకాశాన్ని వదులుకోవడమే కాకుండా దాంతోనే పోటీ పడి తన కొంపకే ఎసరు పెట్టుకున్నాడు. ఎంత సూపర్‌స్టార్‌ అయినా కానీ కొన్నిసార్లు తగ్గాలి మరి.

No comments:

Post a Comment