Wednesday, January 6, 2016

పాలిటిక్స్‌ లోకి మరో స్టార్‌ హీరో

తమిళనాడులో మరో స్టార్‌ హీరో రాజకీయాల్లో ఎంటరవుతున్నారు. తమిళ పార్టీల్లోకి కాకుండా ఆయన జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి చేరేందుకు ప్రముఖ హీరో అజిత్‌ సిద్ధమయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని గట్టిగా కోరుకుంటున్న బీజేపీ తమిళనాడులో సినీ ప్రముఖులను చేర్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. అసలు రజనీకాంత్‌ ను చేర్చుకోవాలని ఎంతో ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అయితే... తలైవార్‌ రజనీకాంత్‌ ను తీసుకురాలేకపోయినా యూత్‌ లో మంచి క్రేజ్‌ ఉన్న తలైగా పిలుచుకునే అజిత్‌ ను ఆకర్షించగలిగింది. రజనీకాంత్‌ కోసం ప్రయత్నించి విఫలమైన తరువాత అజిత్‌ తో సంప్రదించాలని బీజేపీ అధిష్ఠానం అక్కడి శాఖకు సూచించిందట. ఆ మేరకు బీజేపీ తమిళనాడు నేతలు అజిత్‌ ను కలవడం ఆయన అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగిపోయాయి. త్వరంలో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలోనే అజిత్‌ బీజేపీ కండువా కప్పుకొంటారని వినికిడి. ఇది జరిగితే తమిళనాడులో బీజేపీకి మంచి మైలేజి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

No comments:

Post a Comment