Wednesday, January 6, 2016

రామ్‌ని ఖుషీ చేసిన రకుల్‌

ఒక స్టార్‌ హీరో చేసిన సినిమానో, ఒక స్టార్‌ డైరెక్టర్‌ తీసిన సినిమానో చాలా బాగుందంటూ టాక్‌ వచ్చినట్టయితే బడా హీరోలు, పెద్ద సెలబ్రిటీలు అందరూ దానిని పొగుడుతూ తమ వంతు ప్రచారం చేస్తారు. లేదా తమ ఓపెన్‌ మైండెడ్‌నెస్‌ చూపుకోడానికి ఆ అవకాశాన్ని వాడుకుంటారు. కానీ రామ్‌లాంటి యువ హీరో నటించిన సినిమా ఎంత బాగుందన్నా కానీ ఎవరి నుంచీ సరైన స్పందన రాదు. 'నేను శైలజ' చిత్రాన్ని అందరూ మెచ్చుకుంటున్నా కానీ సినిమా వాళ్లనుంచి తగిన ఎంకరేజ్‌మెంట్‌ లేదు. రామ్‌కి ఫోన్లు చేసి అభినందిస్తున్న వారెవరూ కానరావడం లేదు. అయితే 'పండగ చేస్కో' చిత్రంలో తన సరసన నటించిన రామ్‌ విజయాన్ని ఆస్వాదించడానికి రకుల్‌ 'నేను శైలజ' చిత్రాన్ని చూసింది. 'నాన్నకు ప్రేమతో' రిలీజ్‌ హడావిడిలో వున్నా కానీ ఈ చిత్రం చూసి తన అనుభూతిని షేర్‌ చేసుకుని తనవంతుగా ఈ చిత్రానికి సపోర్ట్‌ ఇచ్చింది. సహజమైన నటన కనబరిచారని, డైలాగులు చాలా బాగున్నాయని, ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలతో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారని, సినిమా తనకి బాగా నచ్చిందని చెబుతూ రామ్‌కి కంగ్రాట్స్‌ చెప్పింది. రకుల్‌లాంటి స్టార్‌ హీరోయిన్‌ పొగడ్తలు ఈ చిత్రానికి అంతో ఇంతో హెల్ప్‌ అయి తీరతాయి.

No comments:

Post a Comment