Monday, May 16, 2016

ఐష్ పెదాలకు ఏమైంది బాబోయ్!!

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడం కొత్తేం కాదు. ఏటా కేన్స్ లో రెడ్ కార్పెట్ పై ఐష్ సందడి చేస్తూనే ఉంది. ఈ ఏడాది కూడా ఇలాగే అలరించింది మాజీ మిస్ వరల్డ్. ఇక్కడి రెడ్ కార్పెట్ పై నడిచేందుకు వచ్చేప్పుడు.. ఐష్ డ్రసింగ్ ఫ్యాషన్ కు బోలెడంత క్రేజ్ ఉంది. దాదాపు ఏడేళ్లుగా ఇప్పటి వరకూ తను పాల్గొన్న ప్రతీ ఒక్కో తరహా మోడల్ డ్రసింగ్ - లుక్ - స్టైల్ తో కనిపించి కనికట్టు చేసింది ఐశ్వర్య.

ఈ ఏడాది కూడా కేన్స్ లో ఐశ్వర్య సందడి కొనసాగింది. ఫ్లవర్ డిజైన్ లో స్పెషల్ గా డిజైన్ చేయించిన గౌన్ చూడముచ్చటగా ఉంది. హెయిర్ స్టయిన్ ని కూడా పెద్దగా డిఫరెంట్ గా ట్రై చేయకపోయినా.. ఉన్నంతలో ఆకట్టుకుంది. అన్నిటి కంటే ముఖ్యంగా అమ్మడి లిప్ స్టిక్ కొట్టొచ్చినట్లు కనిపించింది. వయొలెట్ కలర్లో పెదాలను సింగారించింది ఈ సుందరాంగి. మొత్తం అమ్మడి అందాన్ని ఈ ఒక్క లిప్ స్టిక్ డామినేట్ చేసేసినట్లుగా అనిపించిందంటే ఆశ్చర్యం లేదు.

లిప్ స్టిక్ విషయంలో ఐశ్వర్య కొత్తగా ట్రై చేసినా.. కామెంట్స్ మాత్రం అంత పాజిటివ్ గా రావడం లేదు. వీరాభిమానులైతే సూపర్ అంటున్నారు కానీ.. 'గ్రేప్ జ్యూస్ తాగి మూతి తుడుచుకోవడం మర్చిపోయావా ఏంటి ఐష్!' అన్నట్లుగానే ఎక్కువ కౌంటర్లు పడుతున్నాయి. అదాటున చూస్తే అందరికీ అదే అనిపిస్తుంది. ఏంటో.. కొత్త ఫ్యాషన్ ని ముందుగా ఓ ట్రైల్ వేసి చూసుకుని ఉండొచ్చు కదా ఐష్.

No comments:

Post a Comment