Friday, March 3, 2017

ప్రభాస్ కు ట్రాన్స్ ఫార్మర్... అఖిల్ కు ట్రాన్స్ పోర్టర్

త్వరలోనే ప్రభాస్, అఖిల్ సినిమాలు రెండూ ఒకేసారి ప్రారంభం కానున్నాయి. ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు సినిమాలకు హాలీవుడ్ కనెక్షన్ ఏర్పడింది. ప్రభాస్-సుజీత్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు ట్రాన్స్ ఫార్మర్ సినిమాతో... అఖిల్ రెండో సినిమాకు ట్రాన్స్ పోర్టర్ సినిమాతో లింక్ ఏర్పడింది. ఈ రెండు హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసిన ఇద్దరు బడా టెక్నీషియన్లు త్వరలోనే అఖిల్, ప్రభాస్ మూవీస్ కు కూడా పనిచేయబోతున్నారు. ఈ మధ్యంతా వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచిన అఖిల్ ఇప్పుడు తన రెండో సినిమాపై ఫోకస్ పెట్టాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాను ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అఖిల్. కానీ పెళ్లి ఆగిపోవడంతో ఇప్పుడు టోటల్ గా ఫోకస్ మొత్తం తన సినిమాపైనే పెట్టాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కొరేయన్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. హాంకాంగ్ కు చెందిన ఈ యాక్షన్ కొరియోగ్రాఫర్ ది ట్రాన్స్ పోర్టర్ సినిమాతో పాటు ది లెజెండ్, డెడ్ ఆర్ ఎలైవ్ లాంటి సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు. ప్రభాస్ కూడా తన కొత్త సినిమా కోసం హాలీవుడ్ కొరియోగ్రాఫర్ నే నియమించుకున్నాడు. సుజీత్ దర్శకత్వంలో కంప్లీట్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమా కోసం కెన్నీబేట్స్ ను తీసుకున్నారు. ప్రస్తుతం ఈ యాక్షన్ డైరక్టర్ రజనీకాంత్ నటిస్తున్న 2.0 సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేస్తున్నాడు. త్వరలోనే ప్రభాస్ మూవీకి కూడా వర్క్ చేయబోతున్నాడు.

No comments:

Post a Comment